మోసం చేసిన మోడీతో కలుస్తారా, వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు

Recommended Video

    బీజేపీది.. మేం ఏం చేసినా చెల్లుతుందనే కండకావరం : మోడీ పై బాబు

    అమరావతి: కేంద్రం ఏపీ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

    సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పేదరకం లేని సమాజం చూడాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ తనకు స్ఫూర్తి అన్నారు. దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే అపహాస్యం పాలవుతామన్నారు. ఇప్పుడు కేంద్రంపై అలాగే నిర్ణయం తీసుకున్నామన్నారు.

    బీజేపీ నమ్మకద్రోహం

    బీజేపీ నమ్మకద్రోహం

    తన జీవితం ఐదు కోట్ల ఏపీ ప్రజలకు అంకితమని చంద్రబాబు చెప్పారు. విభజన సమస్యలపై తాము అలుపెరుగని పోరాటం చేస్తుంటే వైసీపీ అండ చూసుకుని బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ ఇప్పుడు నమ్మకద్రోహం చేస్తోందన్నారు. విభజన హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

     నమ్మించి మోసం చేసిన మోడీపై ఈగ వాలనీయట్లేదు

    నమ్మించి మోసం చేసిన మోడీపై ఈగ వాలనీయట్లేదు

    నమ్మించి మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై వైసీపీ నేతలు మాత్రం ఈగ వాలనీయడం లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు కేసుల మాఫీ కోసమే బీజేపీతో కుమ్మక్కయారన్నారు. హామీలు నెరవేర్చాలని కోరితే కేంద్రం అడుగడుగునా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. క్లిష్ట సమయంలో తనను ప్రజలు గెలిపించారన్నారు.

    నా మీద నమ్మకంతో భూమి ఇచ్చారు

    నా మీద నమ్మకంతో భూమి ఇచ్చారు

    తన మీద ఉన్న నమ్మకంతో రాజధాని అమరావతి కోసం రైతులు భూమి ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. బీజేపీకి ఏపీలో ప్రాభవం లేదన్నారు. ఓ పత్రిక తనను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కి లాగుతోందని వ్యాఖ్యానించారు.

     నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు

    నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు

    ఏపీ ప్రజల కోసం తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశానని చంద్రబాబు అన్నారు. తమ పోరాటం చివరి వరకు ఆగదని చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని చేయాల్సి ఉందన్నారు. నమ్మించి బీజేపీ మోసం చేసిందని, నమ్మక ద్రోహాన్ని వదిలి పెట్టేది లేదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+