ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. హూటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గతకొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. అయితే తాజాగా ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నారు. మొదట రాజమండ్రి లేదా కాకినాడ హాస్పిటల్ కు తరలించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమైనప్పటికీ.. ముద్రగడ మాత్రం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు కుటుంబసభ్యులు.
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా గత కొంత కాలంగా ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అయితే ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఆయన కూతురు క్రాంతి సంచలన ప్రకటన చేశారు. ఆయనకు సరైన చికిత్స అందించడం లేదంటూ అన్న గిరిపై ఆరోపణలు చేశారు. ముద్రగడను ఎవరూ కలవకుండా బంధించారంటూ క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను ముద్రగడ ఖండిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications