జగన్ నెత్తిన కేంద్రం మరో పిడుగు ! ఉద్యోగుల పోరు వేళ-ఆ ప్రకటన చేస్తే మరో పోరు ?
ఏపీలో ఉద్యోగుల పోరు మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం ఇక్కడ ఉద్యోగులకు కీలకంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే పీఆర్సీ శాతాలతో పాటు పెన్షన్లను కూడా అందించేందుకు వైాసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే కోవలో కేంద్రానికి అందిన తాజా ప్రతిపాదన అమలు చేస్తే ఏపీలో ఉద్యోగులు మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

65 ఏళ్లకే అదనపు పెన్షన్
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న అదనపు పెన్షన్ ను 65 ఏళ్ల నుంచే వర్తింపజేయాలంటూ తాజాగా పార్లమెంటరీ స్ధాయీ సంఘం కేంద్రానికి ప్రతిపాదించింది. దీన్ని కేంద్రం ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకెళ్లింది. తద్వారా దీన్ని వర్తింపచేసేందుకు ఉన్న అభ్యంతరాలపై పరిశీలన జరుపుతోంది. కేంద్రానికి అందిన ప్రతిపాదనల ప్రకారం 65 ఏళ్ల వారికి 5 శాతం అదనపు పెన్షన్, 70 ఏళ్ల వారికి 10 శాతం, 75 ఏళ్లకు 15 శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.

ఏపీలో 70 ఏళ్ల నుంచి
ఏపీలో తాజాగా ఉద్యోగుల పోరు నేపథ్యంలో అదనపు క్వాంటమ్ ను ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు 70 ఏళ్ల నుంచి 74 ఏళ్ల వరకూ 7 శాతం, 75 నుంచి 79 ఏళ్ల వరకూ 12 శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు కనీసం 12-15 శాతం ఇవ్వాలని కోరినా ప్రభుత్వం మాత్రం తమ ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా ఇంతే ఇస్తామని చెప్పి వారిని ఒప్పించింది. అదీ 70 ఏళ్ల వయస్సు వచ్చాకే వీరికి ఈ అదనపు క్వాంటమ్ పెన్షన్ లభిస్తుంది. కానీ ఇప్పుడు కేంద్రం ప్రతిపాదనలతో 65 ఏళ్లకే ఇవ్వాలన్న చర్చ మొదలైంది.

అమలు చేస్తే కేంద్రం అమలు చేస్తే మాత్రం
పార్లమెంటరీ స్దాయీ సంఘం చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ఆర్ధికశాఖ 65 ఏళ్ల నుంచి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరిస్తే మాత్రం ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాలు తమ ఆర్దిక పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకని కనీసం 70 సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం 65 ఏళ్ల నుంచి అమలు చేయడం మొదలుపెడితే రాష్ట్రాల్లనూ ఆ మేరకు డిమాండ్లు మొదలవుతాయి. అప్పుడు సహజంగానే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం ఖాయం.

జగన్ సర్కార్ కు మరో షాక్ ?
ఏపీలో పీఆర్సీ, అదనపు క్వాంటమ్ పెన్షన్, హెచ్ ఆర్ఏ వంటి డిమాండ్లు చేస్తున్న ఉద్యోగులను ఈ మధ్యే చర్చలు జరిపి ఒప్పించింది. ఇంకా సీపీఎస్ వంటి రద్దు డిమాండ్లు నెరవేరనేలేదు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లకే అదనపు క్వాంటమ్ అమలుకు కేంద్రం ఒప్పుకుంటే మాత్రం ఉద్యోగులు మరో పోరు ప్రారంభించడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్న ప్రయోజనాలనే తామూ ఇస్తున్నట్లు వైసీపీ సర్కార్ చెబుతోంది. పీఆర్సీ గడువును కూడా పదేళ్లకు పెంచాలని భావించినా సాధ్యం కాలేదు. ఇలాంటి సమయంలో 65 ఏళ్ల ప్రతిపాదనకు కేంద్రం సై అంటే మాత్రం జగన్ సర్కార్ కు షాక్ తప్పదనే వాదన వినిపిస్తోంది.
-
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications