మహిళపై గ్యాంగ్ రేప్: బాలికపై అటో డ్రైవర్ అత్యాచారం

Sexual assault aginst woman at Vijayawada
విజయవాడ/ హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ రైల్వే యార్డులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినవారిలో రైల్వే భద్రతా బలగానికి (ఆర్‌పిఎఫ్‌కు) చెందిన కానిస్టేబుల్ కూడా ఊన్నాడు. కానిస్టేబుల్‌తో పాటు మరో యువకుడు కలిసి ఆ మహిళపై అత్యాచారం జరిపినట్లు బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో ఓ బాలిక కామాంధుడి దుశ్చర్యకు బలైంది. ఏడేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ఇదిలావుంటే, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మరణించగా, భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆర్థిక సమస్యలో వారి ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

రైలు కింద పడి దంపతుల మృతి

శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులను నరసన్నపేట మండలం మాకివలసకు చెందినవారిగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

దాడిలో యువకుడి మృతి

అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం ఎస్ గుండ్లపల్లిలో ఆంజనేయులు అనే యువకుడిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+