ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగిక దాడి..ఆపై నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్..ఏపీలో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను బెదిరించి ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమలాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక పై లైంగిక దాడి చేసి, ఆపై నగ్న చిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతంపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్ తో పాటుగా అతనికి సహకరించిన మరో 15 మందిపై కేసు నమోదు చేశారు.

కోరిక తీర్చకుంటే ఫ్యామిలీని చంపేస్తానని బాలికను బెదిరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్
వివరాల్లోకి వెళితే అమలాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ తీసుకోవడం కోసం గతంలో రాజమండ్రికి వెళ్ళింది .అక్కడ ఒక కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన మణి వెంకట సత్యనారాయణతో ఆ బాలికకు పరిచయమైంది . ఆ పరిచయంతో గతేడాది అక్టోబర్ 31వ తేదీన అమలాపురం వచ్చిన అతను ఒక లాడ్జిలో వారంపాటు మకాం వేసి బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. తన కోరిక తీర్చాలని బెదిరించాడు.

బాలికపై లైంగిక దాడి ..ఆపై ఆమె నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు
తన కోరిక తీర్చకపోతే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగికదాడి చేశాడు. ఆపై ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆమె నగ్న చిత్రాలను తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక మానసికంగా కుంగి పోయింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ,కొవ్వూరులోని యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ ఆ యువకుడి లో ఎలాంటి మార్పు లేకపోవడంతో రాజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం క్రింద కేసు నమోదు.. సహకరించిన స్నేహితులపై కూడా కేసు , అందులో యువతులు
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు ఈ కేసును బదలాయించారు. ఇక ఈ కేసును కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితుడికి సహకరించిన 15 మంది పై కూడా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే నిందితుడికి సహకరించిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారట.
బాలికపై లైంగిక వేధింపులకు ఆ యువకుడికి విద్యార్థినులు కూడా సహకరించటం శోచనీయం .
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications