తెలంగాణ నోట్‌పై షిండే నీళ్లు: చర్చ ఊహాగానాలే

ఎకె ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఆయన చెప్పారు. కేబినెట్ నోట్, మంత్రివర్గంలో చర్చపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. నోట్ సిద్ధమైన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే అది యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ వద్దకు వెళ్లలేదని, దానిపై తాను సంతకం చేయలేదని ఆయన చెప్పారు.
తెలంగాణ నోట్‌పై సాయంత్రం కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తాము నోట్‌ను వ్యతిరేకిస్తామని ఆయన షిండేకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ నోట్‌పై మంత్రివర్గం చర్చిస్తుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రంలో వేడి పుట్టింది.
ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావును కలిశారు. ఇటు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాదులో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications