వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక సోమవారం.. తెలుగురాష్ట్రాల్లో కిటకిటలాడిన శైవక్షేత్రాలు; ఆలయాలలో సందడి ఇలా!!

|
Google Oneindia TeluguNews

శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీకమాస మూడో సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని శివ క్షేత్రాలు భక్తజన సందడితో కనిపించాయి. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడాయి. శివ నామస్మరణతో మారుమోగాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపారాధన చేశారు. నదీ స్నానాలు ఆచరించి భక్తి ప్రపత్తులతో పూజాదికాలు చేస్తున్నారు.

తెలంగాణా ఆలయాల్లో కార్తీక సోమవారం నాడు పోటెత్తిన భక్తులు

తెలంగాణా ఆలయాల్లో కార్తీక సోమవారం నాడు పోటెత్తిన భక్తులు

కార్తీక సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలలో భక్తులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజామునుంచే భక్తులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వరంగల్ లోని వేయిస్తంభాల దేవాలయంలో, వరంగల్ కోట లోని శంభు లింగేశ్వర దేవస్థానం లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రామప్ప రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా దేదీప్యమానంగా వెలుగొందుతోంది. పాలకుర్తి సోమేశ్వరాలయం లోనూ భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం లోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం లోనూ భక్తులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

ఏపీలోనూ ఆలయాల్లో భక్తుల సందడి

ఏపీలోనూ ఆలయాల్లో భక్తుల సందడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ.. మార్మోగుతున్న శివ నామం

శైవ క్షేత్రాలలో భక్తుల రద్దీ.. మార్మోగుతున్న శివ నామం


అంతేకాదు శ్రీకాళహస్తి, కపిలతీర్ధం సహా ఇతర శైవాలయాలు కూడా భక్తులతో నిండిపోయాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభమయ్యాయి. త్రిపురాంతకం, బైరవకోన, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి,ద్రాక్షారామం, కుమారారామం భీమేశ్వర స్వామి దేవస్థానాలు భక్తులతో సందడిగా మారాయి.

 పవిత్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

పవిత్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

రాజమండ్రిలో గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్‌, మార్కండేయ ఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, గౌతిమి ఘాట్‌లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. కృష్ణా నది పుష్కర ఘాట్ ల వద్ద కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు ఆలయాలలో భగవద్దర్శనం చేసుకుంటున్నారు. మొత్తంగా 3వ కార్తీక సోమవారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశేషంగా భక్తులు ఆలయ సందర్శనలు చేస్తూ పూజలు చేస్తున్నారు.

English summary
Kartika Monday is auspicious in Telugu states. today third kathika monday devotees are doing Special pujas in Shiva temples in both the Telugu states ap and telangana. devotees doing karthika snana and deeparadhana today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X