మోడీ ముందు నోరెత్తు: సోము వీర్రాజుపై శివాజీ ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లడుతున్న వారి పైన భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పిచ్చి మాటలు మాట్లాడవద్దని ప్రత్యేక హోదా సాధన సమితి నేత కారెం శివాజీ శుక్రవారం మండిపడ్డారు.
పిచ్చి మాటలు మాట్లాడటం కాదని, దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ వద్ద వీర్రాజు మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు చొరవ తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు.

అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లు: రామకృష్ణ
ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అంతేగాక వెంకయ్య, చంద్రబాబులు చొరవ తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు.
తూర్పుగోదావరి జిల్లాలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ ఏం ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. హోదా ఇవ్వాలనే డిమాండ్ తో డిసెంబర్ 7 నుంచి ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య వార్ జరుగుతోందని, ఇరు పార్టీల నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక హోదా సాధనసమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సూచించారు.












Click it and Unblock the Notifications