సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబే: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రహస్య పుత్రుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు... సోనియా గాంధీ రహస్య పుత్రినిగా వ్యవహరిస్తున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని విమర్శించే ముందు తమ విధానాన్ని తెలియజేయాలని ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణకు జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని శోభానారెడ్డి అన్నారు. ధైర్యముంటే చంద్రబాబు నాయుడితో సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఓ ప్రకటన చేయించాలని యనమల రామకృష్ణుడిని డిమాండ్ చేశారు.
తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న సమైక్య శంఖారావం యాత్రను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభిస్తారని ప్రకటించడంతోనే తెలుగుదేశం పార్టీ నేతలకు భయం పుట్టుకొచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కుప్పం వస్తే తెలుగుదేశం నాయకులకు అంత భయమెందుకో అని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications