వైసీపీకి బిగ్ షాక్.. తోపుదుర్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఇటీవల సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని పాపిరెడ్డి పల్లి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన క్రమంలో హెలిప్యాడ్ వద్ద చేసుకున్న తోపులాట, ఆపై జరిగిన రగడ తెలిసిందే. ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించటం వెనుక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణమయ్యారని పోలీసులు చెబుతున్నారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు
ఈ క్రమంలోనే ఆయన పైన రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న తోపులాట ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లు సరిగ్గా లేవని పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

హెలిప్యాడ్ వద్ద తోపులాటకు ప్రకాష్ రెడ్డి కారణం
వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న హెలిప్యాడ్ నిర్వహణ సరిగ్గా లేదని డిఎస్పి స్వయంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి చెప్పినప్పటికీ, ఆయననే వైసిపి కార్యకర్తలు అందరూ హెలిప్యాడ్ వద్దకు వెళ్లాలని చెప్పి పంపించారని, తోపులాట ఘటనకు ఆయన కారణమయ్యారని పోలీసులు అంటున్నారు. హెలిపాడ్ వద్ద డిఎస్పి తో ప్రకాష్ రెడ్డి ఈ క్రమంలోనే వాగ్వాదానికి దిగారని పోలీసులు పేర్కొన్నారు.
వైసిపి కార్యకర్తలు బారికేడ్లను తోసుకొని లోపలికి
ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టడంతోనే వైయస్ జగన్ వచ్చినప్పుడు వైసిపి కార్యకర్తలు బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో వివిధ సెక్షన్ల కింద రామగిరి పోలీసులు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు.
ఎస్సైపై తోపుదుర్తి వ్యాఖ్యల తర్వాత కేసు
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న జగన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ సెల్ఫీ వీడియో తో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, రామగిరి ఎస్సైని టార్గెట్ చేసి విమర్శించిన తోపుదుర్తి జగన్ ను అనేంత స్థాయి నీకు లేదని ఎస్సై పై విరుచుకు పడ్డారు. ఇక తాజాగా తోపుదుర్తి మీద కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications