రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఆ డబ్బులు మీ ఖాతాలలో

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా త్వరలోనే అన్నదాతల ఖాతాలలో నగదు జమ చేయనున్నట్టు పేర్కొంది. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే పనిలో పడింది.

సన్న ధాన్యం కొనుగోళ్లను మొదలుపెట్టిన ప్రభుత్వం
ఈ క్రమంలోనే ప్రస్తుతం యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కామారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలలో కొనుగోలు మొదలు కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ సన్న ధాన్యం కొనుగోళ్లను జరిపి ధాన్యం సేకరించిన వెంటనే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయలు వారి ఖాతాలలో జమ చేసేలాగా కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతుంది.

good news to telangana farmers telangana paddy procurement 500 rupees bonus for fine rice

30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా
ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలు చేయడానికి 1500 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.
ఇక మరోవైపు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నాణ్యతను నిర్ధారించటం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గింజ పొడవు వెడల్పును కొలిచేందుకు మైక్రో మీటర్లను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

సన్న రకం వడ్లు పండించేలా ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం ఇస్తున్న క్రమంలో రాష్ట్రంలో సన్న బియ్యం పండించేలా రైతులను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతన్నలకు అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అలాగే ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ను కూడా పొందాలని చెప్తోంది.

యాసంగి ధాన్యం కొనుగోళ్ళు.. బోనస్ ఖాతాలో
ఎట్టి పరిస్థితులలోనూ దళారులను ఆశ్రయించ కూడదని రేవంత్ రెడ్డి సర్కార్ సూచిస్తుంది. ఏది ఏమైనా సన్నరకం వడ్లు పండించిన వారికి ప్రస్తుతం యాసంగి సీజన్లో 500 రూపాయల బోనస్ ను ఇస్తుంది. ఈ డబ్బులు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మిన రైతుల ఖాతాలలో నేరుగా పడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+