ఏపీలో మందుబాబులకు మరో షాక్.. !
ఏపీలో మందుబాబులకు ఎన్నికల వేళ సర్కార్ మరో షాకిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు, నాసిరకం సరుకు, అధిక ధరలతో మందుబాబులు ఠారెత్తుతుండగా.. ఇప్పుడు వారికి మరో షాకిచ్చింది. ఎన్నికలకు ముందు వరకూ క్యాష్ పేమెంట్స్ ను అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ముగిశాక మాత్రం వారికి డిజిటల్ పేమెంట్స్ మాత్రమే చేయాలని చెబుతోంది. అంతే కాదు సేల్స్ కు టార్గెట్లు కూడా పెడుతోంది.
రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటుకు లీజు విధానంలో మద్యం షాపులు ఇచ్చేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే క్రమంగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం షాపుల్ని రద్దు చేసి తామే నిర్వహించేంందుకు సిద్ధమైంది. ఆ తర్వాత తమ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపుల సంఖ్యను ఏటా తగ్గిస్తామని ప్రకటించింది. తొలి రెండేళ్లు మద్యం షాపుల సంఖ్యను నామమాత్రంగా తగ్గించిన ప్రభుత్వం ఆదాయం పడిపోతుండే సరికి తిరిగి వాటిని పెంచింది. అలాగే కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది.

డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చినా మద్యంషాపుల్లో క్యాష్ పేమెంట్స్ మాత్రమే స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో డిజిటల్ పేమెంట్స్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మద్యం షాపులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు సాధ్యమైనంత మేరకు ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐల ద్వారా పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. అయితే రెగ్యులర్ మద్యం షాపులకు వచ్చే వారిలో అత్యధికం పేద వర్గాలకు చెందిన వారే కావడంతో వీరు డిజిటల్ పేమెంట్స్ చేసే పరిజ్ఞానం లేకపోవడంతో ఆ మేరకు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications