షాకింగ్: విశాఖలో బాలికల అక్రమరవాణా గుట్టు రట్టు!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతుందా? గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలలో నిజముందా? ఏపీ కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు రేచ్చిపోతున్నాయా? అంటే అవును అన్న సమాధానమే తాజాగా జరిగిన సంఘటనతో ప్రతీ ఒక్కరి నుండి వినిపిస్తుంది.
బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టు
తాజాగా విశాఖ మీదుగా వెళ్తున్న రైలులో హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేశారు రైల్వే పోలీసులు.విశాఖ రైల్వే స్టేషన్లో తాజాగా కలకలం చోటు చేసుకుంది. విశాఖ కిరండోల్ ఎక్స్ ప్రెస్ లో బాలికల ఆక్రమ రవాణా ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 11 మందిని రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు బాలికలను అక్రమ రవాణా చేసే గ్యాంగ్ నుండి రక్షించారు. వారి చెర నుండి విముక్తి కలిగించారు.

నాలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల నుండి బాలికల అక్రమ రవాణా
ఒడిస్సా,చత్తిస్ ఘడ్,జార్ఖండ్,నేపాల్ లోని మారుమూల గ్రామాల నుంచి బాలికల ఆక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠా ఇప్పటివరకు 100 మంది బాలికలను అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు.
పోలీసుల అదుపులో హ్యూమన్ ట్రాఫికర్
మానవ అక్రమ రవాణా చేస్తున్న నిందితుడు రవి బిసోయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని నుండి ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వీరు ఇప్పటివరకు అక్రమ రవాణాకు పాల్పడిన బాలికలకు సంబంధించి కూడా కూపీ లాగుతున్నారు. ఇక ఈ గ్యాంగ్ కు సంబంధించి ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంది అనేది విచారిస్తున్నారు.
ఇద్దరు మేజర్లతో సహా 11మంది బాలికల రెస్క్యూ
ఇక తాజాగా చేసిన రెస్క్యూ ఆపరేషన్ లో ఇద్దరు మేజర్లతో సహా మొత్తం 11 మంది బాలికలను రెస్క్యూ చేశారు. బాలికలు ఒడిస్సా లోని నవరంగపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ కేసును ఒడిశా పోలీసులకు బదిలీ చేయనున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications