• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో "గే"ల గోల...రాజధాని ప్రాంతంలో భారీగా స్వలింగ సంపర్కులంట!..

|
Google Oneindia TeluguNews

గుంటూరు: "గే"...ఈ మాటకు అర్ధం తెలిసినవాళ్లు గుంటూరులో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు కానీ ఆ పదానికి సంబంధించిన వాళ్లు మాత్రం చాలామందే ఉన్నారట. ఈ మాట అక్కడి వైద్యులే చెబుతున్నారు.

ఇంతకీ "గే"లంటే ఎవరంటే అచ్చ తెలుగులో స్వలింగ సంపర్కులు. వీళ్లు రాజధాని ప్రాంతంలో ఇంకా చెప్పాలంటే గుంటూరులో ఎక్కువగా ఉన్నారట. షాకింగ్ గా ఉందా? కాని ఇదే నిజమంటున్నారు అక్కడి వైద్యులు. రాజధాని ప్రాంతంలో ఈ విపరీత సంస్కృతి బాగా పెరుగుతున్నట్లు తమ వద్ద చికిత్స నిమిత్తం వస్తున్న రోగులను బట్టి తెలుస్తోందంటున్నారు.

 పాశ్చాత్య దేశాల సంస్కృతి...

పాశ్చాత్య దేశాల సంస్కృతి...

గతంలో "గే" అనే పదం విదేశాలకు సంబంధించిన వారి గురించే వినేవాళ్లం..."గే"లు గా పిలవబడే స్వలింగ సంపర్కులు ప్రేమించుకుంటారని, పెళ్లిళ్లు చేసుకుంటారని.. కాపురాలు కూడా చేస్తారని... అక్కడ వారి పెళ్లిళ్లకు చట్టబద్దత ఉందని...ఇలాంటి వార్తలు విని ఆశ్చర్యపోయేవాళ్లం... ఏంటో ఈ విచిత్రం...వైపరీత్యం... అని తిట్టుకునేవాళ్లం...కానీ కాలం మారింది...ఇప్పుడు ఆ సంస్కృతి ఖండాలు దాటి...దేశం లోకి...ఆ తర్వాత ఏకంగా రాష్ట్రంలోకి వచ్చిందని తెలిస్తే ఏమనుకోవాలి...కానీ ఇది నిజం...ఈ సంస్కృతి మన తెలుగునేలపైనా విచ్చిలవిడిగా విస్తరిస్తోందట...

 గుంటూరులో...వాట్సాప్ గ్రూపులు...

గుంటూరులో...వాట్సాప్ గ్రూపులు...

ఈ "గే"ల గోల గుంటూరులో బాగా పెరిగిపోయినట్లు ఓ సర్వేలో తేలిందట. అంతేకాదు ఈ నివేదికలో చాలా షాకింగ్ కోణాలు ఉన్నాయట.ఈ స్వలింగ సంపర్కుల కల్చర్ విస్తృతమయ్యేందుకు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు చాలా దోహదపడుతున్నాయట. ఒక్క గుంటూరు నగరంలోనే 18 వరకూ "గే"ల వాట్సప్ గ్రూపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 కారణాలు ఇవేనట...

కారణాలు ఇవేనట...

ఈ "గే" కల్చర్ విస్తరించడానికి ఇవి కొన్ని కారణాలట...ఉన్నత చదువుల కారణంగా పెళ్లిళ్లకు దూరమవడం...చాలా వయస్సు వచ్చేవరకు పెళ్లి కాకపోవడం...ఏళ్ల తరబడి హాస్టళ్లలో,రూముల్లో గడపడం...బ్లూఫిల్ములు చూడటం వంటి కారణాల వల్ల...క్రమంగా కుర్రాళ్లు గే కల్చర్ వైపు అడుగులు వేస్తున్నారట. గుంటూరులో ఉన్న గే వాట్సప్ గ్రూపుల్లో దాదాపు పదివేలమంది వరకూ మెంబర్స్ ఉన్నారని తెలిసిందట. ఇటీవలి కాలంలో ఈ గే కల్చర్ చాలా చాలా వేగంగా పెరిగిపోతోందని ఆ అధ్యయనంలో తేలింది.

ఒకప్పుడు గుట్టుగా...

ఒకప్పుడు గుట్టుగా...

ఒకప్పుడు ఈ "గే"ల వ్యవహారం చాలా గుట్టుగా సాగేదట...కానీ ఇప్పుడు దాని గురించి చాలా సర్వసాధారణంగా నిస్సిగ్గుగా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. ఈవిధంగా విచ్చలవిడిగా తిరిగిన కారణంగానే కుర్రాళ్లు సుఖవ్యాధుల బారిన పడి పెద్ద సంఖ్యలో వైద్యుల వద్దకు బారులు తీరుతున్నారట. అందువల్లే ఇటీవలి కాలంలో గుంటూరులో స్కిన్ స్పెషలిస్టులను ఆశ్రయించే కుర్రాళ్ల సంఖ్య బాగా పెరిగిందట. అలాగే మానసిక వైద్యుల వద్దకు కౌన్సెలింగ్‌ కోసం వస్తున్న ‘గే'ల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందట.

కాబట్టి...తల్లిదండ్రులారా...మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అంశాల లిస్టులో ఈ విషయాన్నికూడా చేర్చి కేర్ ఫుల్ గా ఉండమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

English summary
An examination of the sexual identity of gays through one survey reveals that shocking truths. That report reveals that number of gays are increasing in guntur area. Social media like Facebook, Watsup...has contributed to the spread of gay culture. One In Guntur city, there are about 18 "gay" watsup groups, that can understand how bad the situation is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X