వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తొలిసారి వైసీపీ -షాకింగ్ రీజన్-అందుకే ఒప్పుకున్న జగన్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాల్లో పోటీ చేయాలని వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పార్టీ తరఫున నేరుగా అభ్యర్ధుల్ని బరిలోకి దింపాలని వైసీపీ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో రాజకీయ చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కీలక కారణాలు బయటికి వచ్చాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో వైసీపీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో వైసీపీ

రాష్ట్రంలో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా నేరుగా బరిలోకి దిగడం లేదు. దీనికి కారణం రాజకీయాలకు అతీతంగా ఈ పోరు ఉండాలనేది పార్టీల నిశ్చితాభిప్రాయంగా ఉండేది. అయితే మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కొన్నేళ్లుగా ఈ ఎన్నికల్లో పార్టీలు నేరుగా తమ అభ్యర్దుల్ని బరిలోకి దింపకపోయినా పార్టీల మద్దతుతోనే అభ్యర్ధులు బరిలోకి దిగేవారు. దీంతో ఆయా అభ్యర్ధుల గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. చివరికి వైసీపీ తొలిసారి నేరుగా అభ్యర్ధుల్ని రంగంలోకి దింపాలని నిర్ణయించింది.

వైసీపీ నిర్ణయంతో పెను మార్పులు

వైసీపీ నిర్ణయంతో పెను మార్పులు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని వైయస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్ధుల్ని బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఓ పార్టీ తరఫున అభ్యర్దులు బరిలోకి దిగి, మిగతా పార్టీల తరఫున పార్టీయేతర వ్యక్తులు మాత్రమే ఉండటం సాధ్యం కాదు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు కూడా ఈసారి తమ అభ్యర్ధుల్ని నిలిపినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి వైసీపీ తీసుకున్న నిర్ణయంపై చర్చలు జరుపుతున్న ఆయా పార్టీలు త్వరలో తమ నిర్ణయాలు ప్రకటించబోతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిడి

వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిడి


వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్ధుల్ని బరిలోకి దింపాలని తొలిసారి తీసుకున్న నిర్ణయం వెనుక వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఈసారి జగన్ కు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరోఒకరికి మద్దతు ఇవ్వడమో, ఉత్సాహం ఉన్నవాళ్లు ముందుకొస్తే వారికి అండగా నిలబడ్డమో చేశామని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. అయితే ఈసారి మాత్రం మనం బరిలోకి దిగాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే జగన్ మాత్రం గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో పెద్దగా మనం ప్రాధాన్యతగా తీసుకోలేదన్నారు.
కానీ ఎమ్మెల్యేలు పట్టు వీడలేదు.

అందుకే ఒప్పుకున్న జగన్ ?

అందుకే ఒప్పుకున్న జగన్ ?


శాసనమండలిలో ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతుకోరితే, మన మద్దతుతో గెలిచిన వారుకూడా ఇవ్వని పరిస్థితులను చూశామని సీఎం జగన్ తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనం పోటీచేయడమే మంచిందని సీఎంతో ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే తమ ఏకాభిప్రాయాన్ని సీఎంకు నివేదించారు. చివరికి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సీఎం జగన్ అంగీకరించారు. గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లోకి మనం వెళ్తున్నామన్నారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం ఖరారు చేశారు.

English summary
after ysrcp mlas request, ys jagan has given nod for party's contest in graduate mlc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X