నేనే శివుడ్ని .. ఈ ఒక్క రోజు వినండి ప్లీజ్ .. మదనపల్లె జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక షాకింగ్ విషయాలతో వెలుగులోకి వస్తున్న మదనపల్లి అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లి లో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు , ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమార్తెలు మూఢ విశ్వాసంతో దారుణానికి పాల్పడ్డారు . తమ ఇద్దరు కుమార్తెలు అలేఖ్య , సాయి దివ్య లను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు , పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే వారిని ఇంట్లో ఉంచే విచారిస్తున్న పోలీసులతో మరోమారు తల్లి పద్మజ గొడవకు దిగారు .

నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా.. భర్తను నిందించిన పద్మజ

నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా.. భర్తను నిందించిన పద్మజ

దేవుడి గదిలోకి బూట్లు వేసుకుని రావొద్దని , ఫోటోలు తియ్యొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు . నా బిడ్డల్ని వాళ్లకు ఎందుకు చూపిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా అంటూ పద్మజ పురుషోత్తం నాయుడును నిందించారు . ఇక పోలీసులను ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ ఒక్క రోజు ఆగితే తన బిడ్డలు బ్రతికి వస్తారని పద్మజ పోలీసులతో చెప్పారు .

ఈ ఒక్క రోజు వినండి ప్లీజ్ అంటూ పోలీసులను బ్రతిమిలాడారు

ఈ ఒక్క రోజు వినండి ప్లీజ్ అంటూ పోలీసులను బ్రతిమిలాడారు

నా బిడ్డలు బ్రతికి వస్తారు... ఈ ఒక్కరోజు అవకాశం ఇవ్వండి .. పోలీసులతో పద్మజ మీ కాళ్ళకు మొక్కుతా సర్ .. నా బిడ్డలు బ్రతికి వస్తారు.. ఒక్క రోజు అవకాశం ఇవ్వండి అంటూ పద్మజ చాలా వింతగా ప్రవర్తించారు. పోలీసులు పద్మజను తీసుకువెళ్తున్న సమయంలోనూ ఆమె చేతులతో సైగలు చేస్తూ చాలా విచిత్రంగా ప్రవర్తించారు . ఇక వీరి కుటుంబం అంతా మానసిక రుగ్మతతో బాధ పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. వారి ప్రవర్తనలో తేడాను వారు గమనిస్తున్నారు .

కూతుళ్ళను మూఢ నమ్మకాలతో హతమార్చిన పద్మజ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.

కూతుళ్ళను మూఢ నమ్మకాలతో హతమార్చిన పద్మజ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.

తానే శివుడినని, తన శరీరం నుండే కరోనా అంటూ పిచ్చిగా ప్రవర్తించిన పద్మజ తానే శివుడినని చెప్తున్నారు . కరోనా చైనా నుండి రాలేదని , చెత్తని కడిగేయటానికి తన శరీరం నుండి తానే పంపించానని , అలాంటి తనకు కరోనా రావటం ఏమిటని ఆమె కేకలు వేసి నానా హంగామా చేశారు . తనకు ఏ టెస్ట్ అవసరం లేదంటూ పద్మజ గందరగోళం సృష్టించారు . నా గొంతులో హాలాహలం ఉంది అంటూ చాలా విచిత్రంగా ప్రవర్తించారు పద్మజ. పరీక్షలకు ఆసప్త్రికి రావటానికి నిరాకరించిన పద్మజకు పోలీసులు పోలీస్ వాహనం వద్దే వైద్య పరీక్షలు నిర్వహించారు.

పురుషోత్తం నాయుడు ఏ 1, తల్లి పద్మజ ఏ 2 .. ఈ రోజు కోర్టు ముందు హాజరు పరిచనున్న పోలీసులు

పురుషోత్తం నాయుడు ఏ 1, తల్లి పద్మజ ఏ 2 .. ఈ రోజు కోర్టు ముందు హాజరు పరిచనున్న పోలీసులు

క్షుద్ర పూజల పేరుతో కుమార్తెలను హతమార్చిన కేసులో తండ్రి పురుషోత్తం నాయుడు ఏ 1గా, తల్లి పద్మజ ను ఏ 2 గా పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడు ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిని మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు సాయంత్రం వారిని కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+