దేశం నివ్వెరపోయే షాకింగ్ వీడియో: మాచర్లలో ఈవీఎంల ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు అనేక హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల హింసాత్మక దాడులు కొనసాగగా అనేకమంది గాయాల పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల దాడులతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పల్నాడులోని మాచర్లలో చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా నివ్వెర పోయేలా చేసాయి.

ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
తాజాగా మే 13న ఎన్నికల పోలింగ్ నాడు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసాయి. మాచర్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని 202నెంబర్ గల పాల్వాగేట్ పోలింగ్ కేంద్రంలో లోపలికి వెళ్లి చేసిన పని పోలింగ్ సిబ్బందిని అవాక్కయ్యేలా చేసింది.

Shocking video Macharla MLA Pinnelli Ramakrishna reddy vandalized EVMs

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీఎం ధ్వంసం వీడియోలు
దౌర్జన్యంగా చొరబడి నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి దానిని తీసుకొని కింద ఎత్తి కొట్టారు. ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉన్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పోలింగ్ నాడు టీడీపీ, వైసీపీ మధ్య దాడులు
అయితే పోలింగ్ సరళిని పరిశీలించడానికి ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఆ కెమెరాలలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తరువాత పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టిడిపి, వైసిపి నేతల మధ్య దాడులు కొనసాగాయి.

అజ్ఞాతంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
కర్రలు,రాడ్లు, రాళ్లు, పెట్రోలు బాంబులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇక మాచర్లలో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆ రోజున ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తరువాత జరిగిన అల్లర్లపై పోలీసుల విచారణ ప్రారంభం కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా ఈ వీడియో బయటకు రావటంతో ఇది చూసిన రాష్ట్ర ప్రజలు అవాక్కవుతున్నారు. ఇతను ఒక ఎమ్మేల్యేనా అని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+