టీడీపీలోకి వెళ్లే నేతను వైసీపీలోకి లాగేసిన జగన్..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది పార్టీలు మారే నేతల సంఖ్య ఎక్కువైంది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు తమ పార్టీల నుంచి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలో చేరాలని చూసిన ఓ నేతకు సీఎం జగన్ బ్రేకులు వేశారు. ఆ నాయకుడు మరెవ్వరో కాదు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో శిద్దా రాఘవరావు టీడీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ నుంచి శిద్దా రాఘవరావుకు పిలుపు రావడంతో ఆయన టీడీపీలో చేరిక వాయిదా పడిందని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించరాయన. 2014లో టీడీపీ , బీజేపీ ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ శిద్దా రాఘవరావు గెలుపుసాధ్యమైంది.2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్‌కు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయించింది.

ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తరువాత అధికారపార్టీ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. టికెట్ వేరే వారికి కేటాయించడంతో..శిద్దా రాఘవరావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.ఈ సమయంలో సీఎం జగన్ నుంచి ఆయనకు పిలుపు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారే ఆలోచనలో ఉన్న శిద్దాను వైసీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది . శిద్దా రాఘవరావు సీఎం జగన్‌ను కలవడంతో పరిస్థితులు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం శిద్దా రాఘవరావు మనుస్సు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అద్దంకి, ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని శిద్దాకు సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదని..ఆయన దర్శి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపించారని.. అప్పటికే దర్శి టికెట్ వేరే వారికి కేటాయించడంతో శిద్దాకు సీటు దక్కలేదు. అంతేకాని ఆయన్ను ఎక్కడా కూడా అవమానించలేదని.. జగన్‌తో మాట్లాడిన తరువాత ఆయన కచ్చింతంగా వైసీపీలోనే కొనసాగతారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్‌తో భేటీ తరువాత శిద్దా రాఘవరావు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
-
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications