20 రోజుల తర్వాత తల్లి ఒడికి చేరిన ఎస్సై సిద్ధయ్య కుమారుడు (ఫొటో)
హైదరాబాద్: అన్న వాహికకు రంధ్రం, ఉపిరితిత్తుల సమస్యతో జన్మించిన ఎస్సై సిద్దయ్య కొడుకు 20 రోజుల తర్వాత తల్లి ఒడికి చేరాడు. చిన్నారి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో తల్లికి అప్పగించారు. కొడుకును ఒడిలోకి తీసుకుని ధరణీష ఉద్వేగానికి గురయ్యారు.
పరిస్థితి కుదుటపడటంతో సోమవారం రెయిన్‌బో ఆసుపత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. సిమీ తీవ్రవాదుల వేటలో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య ఆసుపత్రిలో చేరిన రోజే ఆయన భార్య ధరణీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఆపరేషన్, 20 రోజుల చికిత్స తర్వాత చిన్నారి పూర్తిగా కోలుకోవటంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. సిద్ధయ్యను బ్రతికించడానికి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందాడు. మంగళవారం ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4.06 నిమిషాలకు సిద్ధయ్య తుది శ్వాస విడిచాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications