తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం ముట్టడి: ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్; తీవ్ర ఉద్రిక్తత!!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెగా డీఎస్సీ కోసం చాలా కాలంగా నిరుద్యోగులు పట్టు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నిరుద్యోగుల కోసం 6100 పోస్టులతో మినీ డీఎస్సీ ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే మెగా డీఎస్సీ వస్తుందని భావిస్తున్నారు నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నాయకులు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగిస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలో మెగా డీఎస్సీ కోసం ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. ఛలో తాడేపల్లి పేరుతో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అన్న నినాదంతో వారు ఆందోళనకు దిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడ్డారు.

ఒక్కసారిగా విద్యార్థి నేతలు అందరూ సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకుపోవడంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడి నుంచి వారిని తరలించారు. ఈ ముట్టడిలో వందమందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు సమాచారం. ఇక పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కూడా అయినట్టు సమాచారం.
ఇక మరోవైపు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.మెగా డీఎస్సీ ఇవ్వకుండా ఇప్పుడు కంటి తుడుపు చర్యగా 6100 ఉద్యోగాలు ప్రకటించారని కేవలం ఇది ఎన్నికల స్టంట్ అని విరుచుకుపడుతున్నాయి, మొత్తంగా ఇప్పుడు ఏపీలో మెగా డీఎస్సీ వ్యవహారం రచ్చ రచ్చగా మారుతుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications