టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి

ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ టికెట్‌ను సామాన్య కార్తకర్తకు ఇచ్చి సీఎం జగన్ పెద్ద సాహసమే చేశారు. ఓ సాధారణ డ్రైవర్‌ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు.వచ్చే ఎన్నికల్లో శింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులును అధికార పార్టీ బరిలో దించింది.

ఎమ్మెల్యే జోన్నలగడ్డ పద్మవతిని కాదని వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నియోజకవర్గంలో చాలామంది పేరున్న నాయకులు ఉన్నప్పటికి వారిని దాటుకుని వీరాంజనేయులుకు ఎలా టికెట్ దక్కిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు వీరాంజనేయులు. స్థానికంగా వీరాంజనేయులుకు మంచి గుర్తింపు ఉంది.

singanamala ycp candidate veeranjaneyulu filed nomination

వీరాంజనేయులు 2014 ఎంఎడ్‌ను పూర్తి చేశారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కూడా గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకు ఎటువంటి ఆస్తులు లేవు. వైఎస్సార్‌‌సీపీకి వీర విధేయుడిగా, పార్టీనే నమ్మకుని పని చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలను వీరాంజనేయులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు.

అయితే టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హేళనగా మాట్లాడారు. టిప్పర్ డ్రైవర్ అయితే తన కాళ్ల దగ్గర పడి ఉంటారని అతనికి టికెట్ ఇచ్చాడని జగన్‌ను చంద్రబాబు ఎద్దెవా చేశారు. అయితే తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు కౌంటరిచ్చారు. వీరాంజనేయులు స్వయంగా టిప్పర్ నడపుకుంటూ వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+