చంద్రబాబు టిప్‌ను తిరస్కరించిన సింగపూర్ డ్రైవర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వజూపిన టిప్‌ను సింగపూర్ డ్రైవర్ తిరస్కరించి తన నిజాయితీని చాటుకున్నాడు. తనకు నమ్మశక్యం కాలేదని చంద్రబాబు ఆ విషయాన్ని స్వయంగా ఐటి ఎంటర్‌ప్రెన్యూర్స్ సమావేశంలో చెప్పారు.

తన ఇటీవలి సింగపూర్ పర్యటనలో క్యాబ్ డ్రైవర్‌కు టిప్ ఇవ్వబోయానని, డ్రైవర్ తాను ఇవ్వజూపిన టిప్‌ను తిరస్కరించడమే కాకుండా అటువంటి డబ్బులు తీసుకున్నవారు మళ్లీ దేశంలో రోడ్లపై తిరిగే అవకాశం ఉండదని చెప్పాడని ఆయన వివరించారు.

Singapore driver rejected Chandrababu's tip

సింగపూర్‌లో అవినీతి ఉందా, లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి తాను ఆ టిప్ ఇవ్వజూపానని ఆయన చెప్పారు. తప్పు చేస్తే సింగపూర్‌లో శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు. సింగపూర్‌లోని మరో సంఘటన గురించి కూడా చంద్రబాబు చెప్పారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు చెప్తే కూడా వినలేదని, ఆ వ్యక్తిని శిక్షించారని ఆయన అన్నారు. ప్రపంచంలో మనుషులంతా ఒక్కటేనని, అయితే మెండ్ సెట్‌లో తేడా ఉంటుందని ఆయన అన్నారు. సింగపూర్ అద్భుతమైన దేశమని, తప్పు చేసినవారికి శిక్ష పడుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+