సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు, కల్తీ నెయ్యి కేసులో బిగ్ టర్న్..!!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లింది. ఈ కేసులో మాజీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డిని విచారణ ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కీలక హోదా లో పని చేసిన సుబ్బారెడ్డి విచారణ ద్వారా సిట్ తమకు కావాల్సిన ప్రధాన అంశాల పైన విచారణ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, సిట్ తదుపరి అడుగుల పైనా ఉత్కంఠ కొనసాగుతోంది.
టీటీడీకి కల్తీ నెయ్యి కేసులో దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించనుంది. నేరుగా ఆయన ఇంట్లోనే సిట్ విచారణ చేయటం కీలకంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం విచా రణకు హాజరు కావాల్సిందిగా దర్యాప్తు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి అక్కడే ఆయనను విచారించించేందుకు సిద్దమయ్యారు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? కల్తీ ఎక్కడ జరిగింది? కల్తీ ఎలా చేశారు? అన్న కోణంలోనే విచారణ కొనసాగుతోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీపైనే దర్యాప్తు బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కీలక వ్యక్తులను విచారించడంపై సిట్ దృష్టి సారించింది.

ఇక, ఛైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నా రనే కోణం లో ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లతో ఆయన పీఏ కడూరు చిన్న అప్పన్న మంతనాలు సాగించినట్టు, ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు వెల్లడైంది. అతడిని రెండుసార్లు విచారించిన సిట్ గత నెల 29న అరెస్టు చేసి రిమాండుకు పంపింది. ఇప్పుడు సిట్ సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉండడంతో దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. నెయ్యి సేకరణకు టెండరు నిబంధనలు సడలించడం దగ్గర నుంచీ నెయ్యి సరఫరా వరకూ గత ప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలలో వైవీ పాత్ర ఎంతవరకూ ఉందనే విషయంపై సిట్ ప్రశ్నించే అవకాశముంది. దీంతో.. ఇప్పుడు సుబ్బారెడ్డి విచారణ తరువాత సిట్ తీసుకునే నిర్ణయాలు ఈ కేసులో ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications