టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం..!!
సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ తిరుపతి కేంద్రంగా విచారణ సాగిస్తోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు పరిశీలన చేసింది. నెయ్యి సర ఫరా చేసిన సంస్థల్లో సోదాలు చేసి... నలుగురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో తిరుమలలో లోనూ ఆరా తీసింది. కాగా, ఈ కేసు విచారనలో మరో కీలక నిర్ణయం దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
లడ్డూ కల్తీ ఆరోపణల పైన సిట్ లోతుగా అధ్యయనం చేస్తోంది. కాగా, ఈ కేసులో సిట్ మొదటి ఛార్జిషీట్ వేయనున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన నలుగురు డెయిరీ నిర్వాహకులతోపాటు ఇద్దరు టీటీడీ ఉద్యోగులను నిందితులుగా చేర్చనున్నట్లు తెలి సింది. మరోవైపు నెల్లూరు అనిశా కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ తరువాత మరో వారానికి కేసు వాయిదా పడింది. సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ ఏఆర్ డెయిరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్టవి డెయిరీ సీఈవో అపూర్వా చావడాల విచారణ పూర్తి చేశారు.

నెయ్యి కల్తీ ఎక్కడ ఎంత మేరకు జరిగిందో గుర్తించడంతోపాటు టీటీడీ ప్రొక్యూర్మెంట్లో పని చేసే ఉద్యోగులను విచారించారు. ఈ విభాగంలోని నాగేందర్, శేఖర్ నెయ్యి ట్యాంకర్లు తనిఖీ చేయకుం డా అనుమతించినట్లు, ప్రతి ట్యాంకర్‌కు డబ్బు తీసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. విచారణకు సహకరిస్తామని అరెస్టు చేయవద్దన్న ఉద్యోగుల విన్నపం మేరకు సిట్ సంయమనంతో వ్యవహ రించింది. ఈ కేసును తిరుపతి రెండవ అదనపు మున్సిఫ్ కోర్టు నుంచి నెల్లూరు అనిశా కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో అక్కడ తగిన ఆధారాలతో ఛార్జిషీట్ సమర్పించనున్నట్లు స్పష్టం అవుతోంది. సిట్ లోతుగా చేస్తున్న విచారణలో భాగంగా కొందరు ముఖ్యుల కు సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. విచారణలో భాగంగా సిట్ తీసుకునే నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications