ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!

ఏపీలో ఎన్నికలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రతీ నియోజకవర్గాలో రాజకీయం హోరా హోరీగా మారుతోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. జగన్ నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కడప జిల్లాలోనే చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఉండి లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఉండిలో టీడీపీ రెబల్
ఉండి నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోరు తప్పేలా లేదు. టీడీపీ నుంచి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును చంద్రబాబు ప్రకటించారు.అయితే, నర్సాపురం సీటు బీజేపీ నుంచి ఆశించిన రఘురామరాజుకు ఆ సీటు దక్కలేద. దీంతో..రఘురామ టీడీపీలో చేరారు. ఆయనకు ఉండి సీటు కేటాయించారు. రామ రాజు వర్గం తొలుత నిరసనలకు దిగినా..తరువాత పార్టీ పరంగా రామరాజుకు నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. రఘురామతో కలిసి రామరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా సెట్ అవుతుందని భావిస్తున్న వేళ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నుంచి నేడు స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

Siva Rama Raju to file nomination as independent From Undi becomes trouble for TDP

శివరామరాజు నామినేషన్
శివరామ రాజు 2009,2014 లో వరుసగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన రఘురామ గెలుపొందారు. ఈ సారి ఉండి సీటు పైన శివరామ రాజు ఆశలు పెట్టుకున్నారు. సీటు రామరాజుకు వెళ్లటంతో అప్పుడే తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తన మద్దతు దారులతో కలిసి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో శివరామ రాజు ఆడియో సందేశం విడుదల చేసారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్నట్లు శివరామ రాజు సందేశంలో పేర్కొన్నారు.

ఆసక్తిగా మారుతున్న పోరు
తాను ఇరవై ఏళ్ల టీడీపీలో పని చేసిన విషయాన్ని ఆ సందేశంలో శివరామ రాజు గుర్తు చేసారు. గత ఇరవై రోజులుగా ప్రతి గ్రామం లో తిరుగుతున్నానని వివరించారు. తనను గెలిపించాలని కోరారు. మనం గెలవాల్సిన అవసరం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఇటు రామరాజును బుజ్జగించే ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకత్వం..శివరామరాజు విషయంలో ఏం చేయబోతోందనేది కీలకంగా మారుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు. హోరా హోరీగా మారుతున్న ఉండి నియోజకవర్గంలో శివరామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. దీంతో..శివరామ రాజు నామినేషన్..పోటీ వ్వవహారం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+