మీరు కొట్టుకు చావండి: శివాజీ ఆవేదన, ఏంచేస్తున్నారని జగన్‌కి ప్రశ్న
హైదరాబాద్: నటుడు శివాజీ మరోసారి ప్రత్యేక హోదా పైన ఆవేదన వెళ్లగక్కారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతానని చెప్పారు. ఈ డిమాండ్‌ను చావనీయనన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా పైన కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే కేంద్రమంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు.
ప్రత్యేక హోదా పైన నాయకులు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. మీలు మీరు కొట్టుకొని చావండని, పీడ విరగడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజలను మాత్రం పిచ్చివాళ్లను చేయవద్దన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాబోయే తరాల ఉసురు తగులుతుందన్నారు. నెల రోజులుగా ఉద్యమం పక్కదారి పట్టిందన్నారు. వచ్చే నెల నుంచి ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్మార్ట్ సిటీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా శివాజీ మండిపడ్డారు. జగన్ తన పార్టీ కార్యకర్తల కోసం ఓదార్పు యాత్రలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications