6గురు దొంగల అరెస్ట్: రూ.43లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)
వరంగల్: జిల్లా రూరల్ పోలీసులు శుక్రవారం ఆరుగురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.43లక్షల విలువైన 14మోటారు సైకిళ్లను, ఒక కారును, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు అపహరించిన బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో రూరల్ ఎస్పి కాళిదాసు చోరీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, మడికొండ, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిర,కొత్తగూడెం, సారపాక ప్రాంతాల్లో ఆరు నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల అంతర్‌జిల్లా దొంగల ముఠాలోని ముగ్గురిని మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో ఖమ్మం జిల్లా బూర్గంపాడ్ మండలం సారపాకకు చెందిన దుప్పటి రవి (20), వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు వెంకటేశ్ (25), కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపురానికి చెందిన వల్లెపు ఎల్లయ్య (30) ఉన్నారు. ముఠాకు చెందిన మరో సభ్యుడు ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు శ్రీను పరారీలో ఉన్నాడు.

మీడియా సమావేశంలో..
వరంగల్ జిల్లా రూరల్ పోలీసులు శుక్రవారం ఆరుగురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.43లక్షల విలువైన 14మోటారు సైకిళ్లను, ఒక కారును, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

దొంగల అరెస్ట్
దొంగలు అపహరించిన బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో రూరల్ ఎస్పి కాళిదాసు చోరీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సీజ్ చేసిన బైకులు
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, మడికొండ, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిర,కొత్తగూడెం, సారపాక ప్రాంతాల్లో ఆరు నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల అంతర్‌జిల్లా దొంగల ముఠాలోని ముగ్గురిని మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

దొంగల అరెస్ట్
పోలీసులు అరెస్టు చేసినవారిలో ఖమ్మం జిల్లా బూర్గంపాడ్ మండలం సారపాకకు చెందిన దుప్పటి రవి (20), వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు వెంకటేశ్ (25), కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపురానికి చెందిన వల్లెపు ఎల్లయ్య (30) ఉన్నారు.
ముఠాకు చెందిన నలుగురు కలిసి మహబూబాబాద్ పట్టణం సమీపంలోని కురవి గేట్ వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు శుక్రవారం ఉదయం ఆ ఇంటిపై దాడి చేసి రవి, వెంకటేశ్, ఎల్లయ్యలను అరెస్ట్ చేశారు. వారి వద్ద గల సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 300 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ సుమారు సుమారు రూ.16లక్షల మేర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులతో పాటు వారివద్ద చోరీ సొత్తును కొనుగోలు చేసిన నల్గొండ జిల్లా రామగిరికి చెందిన అనంతచారి, అలాగే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ గౌస్‌పాషాలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ కేసుల్లో ప్రత్యేక చొరవను చూపి అతితక్కువ సమయంలో కేసులను ఛేదించిన మహబూబాబాద్ పట్టణ పోలీసులను రూరల్ ఎస్పి కాళిదాసు అభినందించారు. ఓఎస్‌డీ అంబర్ కిషోర్ ఝా, ములుగు డిఎస్పి మురళీధర్, మహబూబాబాద్ డిఎస్పి శోభన్‌కుమార్, ఏటూర్ నాగారం సిఐ శివరామయ్య, తొర్రూర్ సిఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications