6సార్లు ఎంపి అయినా ఆదాయం లేదు!: పాన్ లేని..

వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూలు లోకసభ స్థానానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య ఇప్పటి వరకు ఐటి రిటర్న్స్ సమర్పించలేదు. ఎందుకంటే అతనికి పన్ను చెల్లించేంత ఆదాయం లేదట. ఈ వివరాలను తన నామినేషన్‌లో వివరించారు.
నంది ఎల్లయ్య తనకు చరాస్తులు రూ. 20,48,969, స్థిరాస్తులు రూ. 50 లక్షల విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. కాగా, 1979 నుంచి 1999 మధ్యకాలంలో సిద్దిపేట ఎంపీగా నంది ఎల్లయ్య పని చేశారు. 1979, 1980, 1989, 1991, 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించగా, 1984, 1998, 1999లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన నంది ఎల్లయ్య పదవీ కాలం ఏప్రిల్ 14న ముగిసింది. గవర్నర్ కోటాలో ఇప్పటికే నంది ఎల్లయ్యను శాసనమండలికి నామినేట్ చేయడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు బక్కని నర్సింహులు కు ఇప్పటి వరకు పాన్ కార్డు లేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications