రైల్వేస్టేషన్లో సైకో కలకలం: 6ఏళ్ల పాపని పొడిచి చంపాడు

ముషీరాబాదులో ఉంటున్న ఆ ఉన్మాది, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. రైల్వే స్టేషన్ వెనుక భాగం నుండి వచ్చారు. రైలు కోసం కుటుంబ సభ్యులు పదవ ప్లాట్ ఫారం పైన నిరీక్షిస్తున్న సమయంలో ఈ సైకో ఒక్కసారిగా అక్కడకు వచ్చి పాపపై కత్తితో దాడి చేశాడు. పాపను లాక్కొని కత్తితో పొడుచుకుంటూ వెళ్లాడు. అతనిని చక్రవర్తి అనే సాఫ్టువేర్ ఇంజనీర్‌తో పాటు ఇంకొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణీకులు సైకోను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.
ఎసిబి వలలో వర్క్ ఇన్స్‌పెక్టర్
అనంతపురం జిల్లా మడకశిర గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఒక రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటూ ప్రసాద్ ఎసిబికి చిక్కారు.
రైతులు మృతి
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఇద్దరు రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందారు.
విజిలెన్స్ దాడులు
రవాణా పన్ను ఎగవేస్తూ బియ్యం, పత్తిని రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్ పోస్టు సమీపంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దాడులు నిర్వహించారు.
నాలుగు లారీల్లో రూ.18 లక్షల విలువైన బియ్యం, మరో నాలుగు లారీల్లో రూ.18 లక్షల విలువైన పత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు విజిలెన్స్ సిఐ తెలిపారు.












Click it and Unblock the Notifications