'స్కంద' చిత్రంపై మహేష్ బాబు సంచలన నిర్ణయం!
సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరున్న ఘనత ఏమిటంటే.. తన కెరీర్ లో ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. పరాయి భాషలో ఆ సినిమా సూపర్ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా సరే తాను మాత్రం తన మీద నమ్మకంతోపాటు కథమీద, దర్శకుడిమీద నమ్మకంతో నేరుగా నిర్మించే చిత్రంలోనే నటించేవారు. తాను చేసిన ప్రతి సినిమాలోను అది హిట్ అయినా, ఫ్లాపైనా కొత్తదనం ఉండేలా చూసుకునేవారు.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ముందుగా బోయపాటి ఈ కథను మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని రాసుకున్నారు. ప్రిన్స్ దగ్గర ఈ సినిమా కథను పూర్తిగా వివరించారు. కథకు మహేష్ బాబు బాగా ఇంప్రెస్ అయ్యారు. కథ చాలా బాగుందికానీ ఈ కథను తాను సరిపోనని చెప్పారు. మాస్ ఎలిమెంట్ కు, ఊర మాస్ గా కనపడటానికి తాను పనికిరానని, అభిమానులు కూడా మెచ్చుకోరని, తన పర్సనాలిటీ ఆ కథకు నచ్చదని, తాను న్యాయం చేయలేనని చెప్పారు.

ఈ సినిమా రెండో భాగంలో హీరోయిజం ఊర మాస్ లెవల్లో ఉంటుంది. అలా కనపడటానికి తన బిహేవియర్ సెట్ కాదన్నారు. ఆ సినిమానే రామ్ తో బోయపాటి తీశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల కథానాయికగా నటించింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి దీన్ని నిర్మించారు. సంగీతం థమన్ అందించారు. రామ్ ను వేరే లెవల్ కు ఈ సినిమా తీసుకెళుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే మహేష్ బాబు మరో సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్లయ్యేదంటున్నారు.












Click it and Unblock the Notifications