మూణ్నెళ్లుగా అదృశ్యం: మహిళ అస్తిపంజరం లభ్యం

 Skeletal remains of two women found near airport
హైదరాబాద్: మూడు నెలలుగా కనిపించకుండా పోయిన ఓ మహిళ అస్తిపంజరం లభ్యమైంది. ఆమె అస్తిపంజరంతో పాటు మరో మహిళ అస్తిపంజరం కూడా శంషాబాద్ విమానాశ్రయం వద్ద కనిపించింది. శుక్రవారంనాడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వాటిని చూసి, పోలీసులను అప్రమత్తం చేశారు.

ఓ మహిళను 45 చంద్రకళగా గుర్తించారు. పని మనిషిగా పనిచేస్తూ వస్తున్న ఆమె మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. మరో మహిళను ఇంకా గుర్తించాల్సి ఉంది. అత్యాచారం చేసిన వారిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

చంద్రకళను ఆమె భర్త చంద్రయ్య ఫొటోను చూసి గుర్తించారు. చంద్రకళ అస్తిపంజరం పడి ఉన్న చోట అతని ఫొటో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దంపతుల ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో సికింద్రాబాదులోని కుషాయిగుడాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్వర్ణకారుడైన 36 ఏళ్ల ఎఁ కమల్‌తో పాటు 30 ఏళ్ల ఆయన భార్య నాగమణి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. వారు వరంగల్ జిల్లాకు చెందినవారు.

ఉపాధి కోసం వారు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. వారికి 11 నెలల కూతురు ఉంది. పాప గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఇరుగుపొరుగు వారు దంపతుల ఆత్మహత్య విషయాన్ని గుర్తించారు. వారు విషం తీసుకుని మరణించి ఉంటారని భావిస్తున్నారు. సూసైడ్ నోట్ ఏదీ లభ్యం కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+