నా భర్తతో కలిసి వెళ్లా, దుస్తులపై ఇంత జుగుప్సకరంగా: ఔట్‌లుక్‌పై స్మితా సబర్వాల్

హైదరాబాద్: తన పుట్టిన రోజు నాడు తన భర్తతో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నానని, అప్పుడు తాను వేసుకున్న దుస్తులని సూచిస్తూ ఔట్‌లుక్ ఇలా జుగుప్సాకరంగా వ్యవహరిస్తారని అనుకోలేదని తెలంగాణ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ మండిపడ్డారు. ఓ జాతీయ చానెల్‌తో ఆమె వివాదానికి సంబంధించి మాట్లాడారు. ఆంగ్ల పత్రిక ఔట్‌లుక్‌పై తాను న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు ఆమె తెలిపారు.

ఉన్నతమైన సివిల్ సర్వీసెస్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఎల్లో జర్నలిజం ఈ స్థాయిలో వేధింపులకు పాల్పడుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆమె అన్నారు. ఇది కేవలం తనను మాత్రమే కాకుండా మొత్తం మహిళా లోకాన్ని అవమానించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Smita Agarwal lashes out at Outlook

ఇప్పటికే తన తరఫు న్యాయవాది ఔట్‌లుక్ మ్యాగజైన్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారని ఆమె చెప్పారు. దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు స్మితా సబర్వాల్ చెప్పారు. స్మిత సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే.

ఔట్ లుక్ మ్యాగజైన్ తన తాజా సంచికలో నో బోరింగ్ బాబు అనే శీర్షికతో ఓ వ్యాఖ్యను ప్రచురించింది. స్మిత సబర్వాల్‌కు సంబంధించిన కార్టూన్‌నున అత్యంత అభ్యంతరకరమైన రీతిలో ఔట్‌లుక్ ప్రచురించింది. దానిపై తీవ్రంగా ప్రతిస్పందించిన స్మిత సబర్వాల్ అదే పత్రికలో అంతే నిడివితో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశఆరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+