కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప కార్పొరేషన్‌లో చూడకూడని దృశ్యాలు: రాసలీలలపై సిబ్బంది అసహనం!

ఉద్యోగుల సౌకర్యం కోసం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన కడప మున్సిపాలిటీని లక్షల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లతో నవీకరించింది ప్రభుత్వం. అయితే, కొందరు ఉద్యోగులు తమకు వేర్వేరుగా ఉన్న ఛాంబర్లలో .

|
Google Oneindia TeluguNews

కడప: ఉద్యోగుల సౌకర్యం కోసం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన కడప మున్సిపాలిటీని లక్షల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లతో నవీకరించింది ప్రభుత్వం. అయితే, కొందరు ఉద్యోగులు తమకు వేర్వేరుగా ఉన్న ఛాంబర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులను, ఇతర మహిళలను లొంగదీసుకుని కార్యాలయంలోనే కామ కలాపాలు సాగిస్తున్నారనే వార్తలు నగర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

కార్పొరేషన్‌ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెండు చాంబర్లలో, రెండవ అంతస్తులోని ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఒక చాంబర్‌లో రాసలీలలు సాగుతున్నట్లు పలువురు కార్యాలయ ఉద్యుగులే వెల్లడించడంతో ఈ వార్త బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది. మూడు చాంబర్లలో ఇద్దరు అధికారులు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ రాసక్రీడలను సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చాంబర్‌ల పక్కన పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది.

రాసక్రీడలు

రాసక్రీడలు

ఒక్కొక్కసారి ఏదైనా పనిమీద చాంబర్‌లోకి వెళ్లినపుడు సహోద్యోగులకు రాసక్రీడల దృశ్యాలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. అంతేగాక, కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి చాంబర్‌లో యాంటీరూంను ఏకంగా బెడ్‌రూమ్‌గా మార్చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో..

అదే సమయంలో..

సాధారణంగా కార్యాలయం పనుల మీద కమిషనర్‌ హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ సమయాల్లో కొంతమంది ఉద్యోగులు కమిషనర్‌ చాంబర్‌ తాళాలను డూప్లికేట్‌ చేసుకుని వాటితో తెరచి యాంటిరూమ్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు తెలిసింది.

వాడుకుంటున్నారు..

వాడుకుంటున్నారు..

రాసలీలలు నడిపే ఉద్యోగులు కార్యాలయంలో దిగువస్థాయి సిబ్బందిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక, వారికి క్వార్టర్‌ మద్యం, రూ.200 నగదు ఇస్తే అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సహోద్యోగులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం.

ఎంతో జాగ్రత్తగా..

ఎంతో జాగ్రత్తగా..

కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు కమిషనర్‌ దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం. అంటే, రాసలీల ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా తమ పనిని చక్క బెట్టుకుంటున్నారో అర్థమవుతుందని ఉద్యోగులు అంటున్నారు. తమ కంటే ఉన్నత పదవుల్లోని ఈ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కార్యాలయంలోని సిబ్బంది కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Sociopaths activities are going on in kadapa corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X