జగన్ ఆస్తులు అప్పగించి, శిక్షను అనుభవించాలి: సోమిరెడ్డి షరతు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖపట్నం భూముల వ్యవహారం కేసులో ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తోన్న విమర్శలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం స్పందించారు. వైసిపి నేతలకు సిబిఐ పేరు ఎత్తే అర్హత లేదన్నారు. సిట్ విచారణతో న్యాయం జరుగుతుందన్నారు.

చదవండి: అఖిలప్రియ దూకుడు, చంద్రబాబు సీరియస్

ఈ కేసుకు సిట్ చాల‌ని, సిబిఐ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వం ఏ ప‌ని చేసినా అనవసరమైన విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌ను అప్ప‌గిస్తే విశాఖ భూముల‌పై సిబిఐ విచార‌ణ జ‌రిపిస్తామ‌ని స‌వాల్ విసిరారు.

Somireddy Chandramohan Reddy challenges on CBI enquiry

సిబిఐ విచారణపై న‌మ్మ‌కం ఉంటే జ‌ప్తు చేసిన ఆస్తుల‌ను అప్ప‌గించి జ‌గ‌న్ శిక్ష అనుభ‌వించాలని, అప్పుడు తాము కూడా విశాఖ భూమములపై సిబిఐ విచారణకు ఓకే చెబుతామని మెలిక పెట్టారు. సిబిఐ నిగ్గుతేల్చిన అక్రమాస్తులను అప్పగిస్తే విశాఖ భూములపై వెంటనే తాము విచారణ వేయిస్తామన్నారు.

మ‌రోవైపు ఇదే అంశంపై పిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆయ‌న వ్యాఖ్య‌లు స‌రికాదని సోమిరెడ్డి అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Somireddy Chandramohan Reddy on Thursday challenged YSR Congress Party chief YS Jaganmohan Reddy to surrender his assets.
Please Wait while comments are loading...