వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎంపీకి మద్దతుగా మాజీ మంత్రి సోమిరెడ్డి ; అక్రమ మైనింగ్ లో మాగుంటను ఇరికించింది కాకాణి గోవర్ధన్ రెడ్డినే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో దుమారం రేపుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా వేదికగా ఆసక్తికరమైన పంచాయితీ కొనసాగుతుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతునిస్తూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలు నెల్లూరు రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. నెల్లూరు జిల్లా కేంద్రంగా ప్రస్తుతం ఈ వ్యవహారంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగుతుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ పక్షాన మాట్లాడటం ఆసక్తిని రేపుతుంది.

అక్రమ గ్రావెల్ మాఫియా ..ఎంపీ మాగుంటపై కేసు నమోదు

అక్రమ గ్రావెల్ మాఫియా ..ఎంపీ మాగుంటపై కేసు నమోదు

ఇంతకీ ఏం జరిగిందంటే నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో అనుమతి తీసుకున్నారని సమాచారం. నీటిపారుదల శాఖ నుండి అక్రమార్కులు అనుమతి తీసుకున్నట్టు సమాచారం. అయితే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్న నేపధ్యంలో రైతులు ఆందోళనకు దిగగా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి అక్రమ గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

సొంత పార్టీ ఎంపీని కాకాణి గోవర్ధన్ రెడ్డి బలిచేశారని సోమిరెడ్డి ఆరోపణ

సొంత పార్టీ ఎంపీని కాకాణి గోవర్ధన్ రెడ్డి బలిచేశారని సోమిరెడ్డి ఆరోపణ

దీనిపై వైసీపీ పెద్దలు సీరియస్ అవ్వగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసిపి పెద్దల ముందు లబోదిబోమన్నారని సమాచారం. ఇదిలా ఉంటే టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ మైనింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తన దోపిడీ కోసం కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత పార్టీకి చెందిన ఎంపీని బలి చేయడానికి సిద్ధపడ్డారని ఆయన ఆరోపించారు.

మైనింగ్ అనుమతుల కోసం కాకాణి అనుచరులతో మాగుంట సంతకం ఫోర్జరీ చేశారని ధ్వజం

మైనింగ్ అనుమతుల కోసం కాకాణి అనుచరులతో మాగుంట సంతకం ఫోర్జరీ చేశారని ధ్వజం


మైనింగ్ అనుమతుల కోసం కాకాణి తన అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయించారని, సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ దరఖాస్తు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తమ మీదకు రాకుండా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆయన అభిప్రాయపడ్డారు. దరఖాస్తు పెట్టింది వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే దీనిపై పోలీసులు ఎందుకు విచారణ చేయలేదు అని ప్రశ్నించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు మాగుంట పేరును ఏ2 గా చేర్చారని ప్రశ్నించారు.

అక్రమ మైనింగ్ లో వైసీపీ ఎంపీని ఇరికించింది ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సోమిరెడ్డి ఆగ్రహం

అక్రమ మైనింగ్ లో వైసీపీ ఎంపీని ఇరికించింది ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సోమిరెడ్డి ఆగ్రహం

అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాహనాలను పట్టుకున్న పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టార్గెట్ చేశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులు, జలవనరుల అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఉంది వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ వ్యవహారం ముందు ముందు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

English summary
TDP senior leader Somireddy Chandramohan Reddy has targeted MLA Kakani Govardhan Reddy over the gravel mining affair. He alleged that Kakani Govardhan Reddy was intensionally targeted a MP from his own party for his exploitation. He opined that Magunta Srinivasulu Reddy was implicated in the case as complaints were lodged against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X