శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదేనా నీ పరిణితి? చిరంజీవి సర్పంచ్ అయ్యారా?: పవన్‌ కళ్యాణ్‌పై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పార్టీలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్
 పవన్.. నీ పరిణితి అదేనా?

పవన్.. నీ పరిణితి అదేనా?

అంతేగాక, పవన్ లెక్క ప్రకారం.. జిల్లా కలెక్టర్‌గా పనిచేయాలంటే ముందు బిల్ కలెక్టర్‌గా పనిచేయాలేమోనని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ వ్యాఖ్యానించడం ఆయన పరిణితికి అద్దం పడుతోందని అన్నారు.

కాంగ్రెస్‌కు చిరంజీవి గుడ్‌బై?: సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు! రాహుల్ కోరినా.., పవన్ ఉండగా..?కాంగ్రెస్‌కు చిరంజీవి గుడ్‌బై?: సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు! రాహుల్ కోరినా.., పవన్ ఉండగా..?

ఏం భాష మాట్లాడుతున్నావ్??

ఏం భాష మాట్లాడుతున్నావ్??

తోలుతీస్తా.. తాటతీస్తా.. గోదాట్లో కలిపస్తా.. ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదని.. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మోడీతో జగన్, పవన్ ప్రయాణం ఖాయమైందని, ఇది ప్రజల అభిప్రాయమని అన్నారు.

చిరంజీవి సోదరుడిగా.. పవన్ రాజకీయాల్లోకి..

చిరంజీవి సోదరుడిగా.. పవన్ రాజకీయాల్లోకి..

వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్.. తన అన్న చిరంజీవి వారసత్వం నుంచే తాను రాజకీయాల్లోకి రాలేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రజారాజ్యం ఎత్తేస్తేనే జనసేన పెట్టారని అన్నారు. చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారనే వార్తలు వస్తున్నాయని అన్నారు. చిరంజీవి ఏమైనా సర్పంచ్‌గా ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారుగా.. అని ప్రశ్నించారు.

సీఎంపై పదవిపై ఆశ లేదంటూనే..

సీఎంపై పదవిపై ఆశ లేదంటూనే..

సీఎం పదవిపై తనకు ఆశ లేదని చెప్పుకుంటూ.. మంగళవారం నాటి సభలో పవన్ సీఎం అని నినాదాలను అభిమానులతో చేయించుకోవడమేంటని సోమిరెడ్డి నిలదీశారు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని పిలిస్తే మూడు పార్టీలే వచ్చాయి.. మీరొచ్చారా? అని ప్రశ్నించారు.

 భారీ కవాతుకు డబ్బు ఎక్కడిది?

భారీ కవాతుకు డబ్బు ఎక్కడిది?

తుఫాను నష్టపోయిన శ్రీకాకుళంలో సీఎం, మంత్రులు ఉంటే.. మీరు కవాతులు చేస్తారా? అని పవన్‌ను సోమిరెడ్డి ప్రశ్నించారు. అంత భారీ స్థాయిలో కవాతు చేయడానికి డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని నిలదీశారు. కమెడియన్ వచ్చినా జనాలు వస్తారు.. తన కుమారుడు పిలిస్తే 6వేల మంది బైక్ లపై వచ్చారని చెప్పారు.

చిరంజీవికీ జనాలు వచ్చారు.. డిపాజిట్లు రాలేదు

చిరంజీవికీ జనాలు వచ్చారు.. డిపాజిట్లు రాలేదు

‘చిరంజీవికి కూడా జనం వచ్చారు.. డిపాజిట్ రాలేదు. మీరొక్కరే దేశాన్ని ఉద్ధరించినట్లు.. మిగితా వారంతా దోచుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. పవన్, బీజేపీ వల్లే టీడీపీ గెలిచిందా? గెలుపులో మీ పాత్ర కూడా ఉందని మేమే చెప్పాం. కానీ, మీరే గెలిపించామనడం సరికాదు. 36ఏళ్ల కిందే టీడీపీ పుట్టింది.. అప్పుడు మీరెక్కడుతున్నారు? భాష మార్చుకోండి. మీరు ఎదిగితే ఎవరూ అడ్డుకోరు' అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పవన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

English summary
Andhra Pradesh minister Somireddy Chandramohan Reddy on Tuesday takes on Janasena Party president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X