కాంగ్రెస్ బృందంతో జగన్ నేతల భార్యలు: టిడిపి ప్రశ్నలు

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసమే వారు ఢిల్లీ పెద్దలను కలిశారని ఆరోపించారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకుల సతీమణులు భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలను సీమాంధ్రలో అడ్డుకుంటుంటే వారి సతీమణులతో కలిసి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

విభజన విషయంలో సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే కాంగ్రెసు పార్టీ ఆంటోని కమిటీని వేసిందని, ఇక్కడి ప్రజలను మెప్పించేందుకు ఏం కమిటీ వేస్తారని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెసు నేతల భార్యలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల భార్యలు ఒకే లేఖపై సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. ఇటలీ మాఫియాకు, ఇడుపులపాయ మాఫియాకు లింకుందన్నారు. జగన్ బెయిల్ కోసం కడప పౌరుషం నీరుగారిందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+