పసివయసులో ఇంతనా: జగన్‌ను ఏకిపారేసిన సోమిరెడ్డి

Somireddy takes on YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ పార్టీ పెట్టి మూడేళ్లు కాలేదని అప్పుడే.. థర్డ్ ఫ్రంట్ అని, యూపిఏ అని, మమతా బెనర్జీకి అంటూ మద్దతుపై రోజుకో మాట మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లో బిజెపితో కలిసే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీని ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్రంలో చక్రం తిప్పుతానని, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ తీసుకుంటానని చెప్పారని, ఇప్పుడు మోడీని కలవడం విడ్డూరమన్నారు. వామపక్షాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత జగన్‌దే అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్ మద్దతుపై రోజుకో మాట చెప్పారన్నారు. ఆర్థిక నేరాల కేసులో ఉన్న జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మనుగడ సాధించలేదని చెప్పారు.

రాజకీయ నాయకులపై ఉన్న ఆర్థిక నేరాల కేసులను సంవత్సరం లోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందన్నారు. 2014లో జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు. ఇంత పసి వయసులో జగన్ మాట మీద నిలబడకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు గతంలో ప్రయత్నించడం విడ్డూరమన్నారు. జగన్ పైన కేసుల నేపథ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటారని తాను భావించడం లేదన్నారు.

జగన్ తనంతట తానుగా మూడేళ్లుగా కేంద్రంలో వారికి మద్దతు, వీరికి మద్దతు అంటూ తన నోటితోనే చెప్పారన్నారు. రోజుకొక పార్టీకి మద్దతు అని చెప్పడం జగన్ నైజమన్నారు. కేసుల విచారణ పూర్తయితే జగన్ పార్టీ ఉండదన్నారు. టిక్కెట్లు అమ్ముకోవడమే జగన్ విధానమన్నారు. తండ్రీకొడుకుల వల్ల దేశం నాశనమైందన్నారు. ఎపిలో తమకు టిడిపితో పొత్తు ఉందని, ఇంకెవరితో కలవమని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం బాధ్యత తమపై ఉందనన్నారు.

27, 28న మహానాడు

ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును నిర్వహించనున్నారు. మహానాడుకు పర్యవేక్షకులుగా టిడి జనార్ధన్‌ను నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+