ఎప్పుడూ కష్టాలేనా: బాబుకు బిజెపి షాక్, సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా కొత్త చిక్కులు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలు పలువురు రాష్ట్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు.

బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ కష్టాల్లోనే ఉన్నామని ఏపీ నేతలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఎప్పుడూ ప్రత్యేక హోదా గురించి మాట్లడుతున్నారు తప్పితే.. వచ్చిన దానిని గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నామని చెబుతూ పుష్కరాల కోసం రూ.1600 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీశారు.

తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించడం లేదన్నారు. అధికార యంత్రాంగం పైన పట్టుకోల్పోయారన్నారు. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ధరల పెరుగుదలపై ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.

Somu Veerraju hot comments on AP government

ఏపీ పుష్కరాలకు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టడం పైన విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా పలువురు దీని పైన నిలదీశారు. ఇప్పుడు బిజెపి నేతలు కూడా నిలదీయడం గమనార్హం.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఇతర టిడిపి నేతలు రాష్ట్రం విషయమై మాట్లాడినప్పుడల్లా విభజన తర్వాత ఏపీ నష్టాల్లో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా సోము వీర్రాజు విరుచుకుపడటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+