వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మకూరులో ఏకగ్రీవం ఛాన్స్ లేదిక - మేకపాటికి పోటీగా : వైసీపీ వ్యూహం ఇదే..!!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బై పోల్ కు మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ రానుంది. మే నెఖారులో ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా. అయితే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా..మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే..వారి కుటుంబ సభ్యులకే తిరిగి అవకాశం దక్కితే..ప్రత్యర్ధి పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో పెట్టకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇది అమలు చేసారు.

మరి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ జరిగింది. ఇక, ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మరణంతోనే ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేసారు.

త్వరలో ఆత్మకూరు ఎన్నికల షెడ్యూల్

త్వరలో ఆత్మకూరు ఎన్నికల షెడ్యూల్

ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. దీంతో..ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేయానే అంశం పైన నిర్ణయం సీఎం జగన్ మేకపాటి కుటుంబానికి వదిలేసారు. కుటుంబంలో చర్చల తరువాత ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ సోదురుడు..మేకపాటి విక్రమ్ రెడ్డిని బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయాన్ని సీఎం జగన్ కు మేకపాటి కుటుంబం వివరిచింది. ఇక, ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేసారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.

బీజేపీ వర్సెస్ వైసీపీ పోటీ ఖాయమేనా

బీజేపీ వర్సెస్ వైసీపీ పోటీ ఖాయమేనా

గతంలో కడప జిల్లా బద్వేలు బై పోల్ విషయంలోనూ బీజేపీ బరిలో నిలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికి వైసీపీ సీటు కేటాయించింది. టీడీపీ - జనసేన పోటీకి దూరంగా ఉన్న బీజేపీ తమ అభ్యర్ధిని నిలబెట్టింది. జాతీయ పార్టీగా తమ విధానాలు వేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక, ఇప్పటికే తాను బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉంటానంటూ మేకపాటి బంధువు బిజివేముల రవీంద్రారెడ్డి గతంలోనే ప్రకటించారు. బీజేపీ నో అంటే తాను స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించటంతో..దాదాపుగా రవీంద్రా రెడ్డికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

వైసీపీ అభ్యర్ధిగా విక్రమ్ రెడ్డి..

వైసీపీ అభ్యర్ధిగా విక్రమ్ రెడ్డి..

అయితే, నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను గెలుచుకుంది. ఆత్మకూరులో ఇప్పుడు గెలుపు కంటే ఎన్నిక జరిగితే మెజార్టీ పైనే ఫోకస్ పెట్టాలని వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇక, ఇప్పటికే 2024 ఎన్నికల దిశగా కార్యాచరణ అమలు చేస్తున్న సీఎం జగన్... పార్టీ సత్తా చాటే సమయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో...బీజేపీ బరిలో దిగితే జనసేన -టీడీపీ మద్దతిచ్చే అవకాశాలు కనిపింటచం లేదు. ఈ నెలాఖరులో ఉప ఎన్నిక షెడ్యూల్ విడులయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary
BJP AP Chief Somu Veerraju stated party ccandidate will contest in Atmakur bypoll, with this decision contest may be between YCP and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X