టిడిపి చేసిందేమీ లేదు, పవన్‌కు చెప్పింది నేనే: సోము వీర్రాజు

తూర్పుగోదావరి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందేమీ లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో టిడిపి తన ఘనతగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

Somu Veerraju on Telugudesam government

రాష్ట్రంలో టిడిపి గెలుపునకు తానే కారణమని అన్నారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను టిడిపికి మద్దతు ఇవ్వాలని చెప్పి కలిపింది తానేనని చెప్పారు. దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీసుకువెళ్లడానికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ పార్టీ నేతలకు మతిభ్రమించింది

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. బాక్సైట్ జోలికోస్తే గిరిజన ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరకుతామంటూ విశాఖపట్టణం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డిక ఈశ్వరి హెచ్చరించడం దుర్మార్గమని చెప్పారు.

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈశ్వరి దిష్టిబొమ్మను శనివారం ఇక్కడ కాళ్ల నాయుడు మందిరం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఈశ్వరి ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు జగన్ బహిరంగసభలో ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం దారుణమన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి తల నరుకుతానంటూ ఎమ్మెల్యే బహిరంగ సభలో ప్రకటించడం క్షమించారని విషయమని అన్నారు. ఎమ్మెల్యే ఈశ్వరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+