వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీది ఒంటరి పోరే-అవసరమైతే జనసేనతో పొత్తు-తేల్చేసిన సోము-బాబు-పవన్ రాజకీయంతో

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పొత్తుల వ్యాఖ్యలు, వాటికి పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు కాషాయ నేతల్ని చికాకు పెడుతోంది. ఇవాళ కాకపోతే రేపు పవన్ కళ్యాణ్ తమకు గుడ్ బై చెప్పడం ఖాయమనే అంచనాకు వచ్చేసిన బీజేపీ నేతలు.. అందుకు ప్రిపేర్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇవాళ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

 టీడీపీ-జనసేన పొత్తు రచ్చ

టీడీపీ-జనసేన పొత్తు రచ్చ


ఏపీలో టీడీపీ-జనసేన మధ్య 2014 తర్వాత మరోసారి పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. కలిసొచ్చే ప్రతిపక్షాల్ని కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ఆఫర్లు ఇస్తుంటే.. అద్భుతం జరగొచ్చంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎన్నికలకు ముందే టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న బీజేపీలో అసహనం పెంచుతున్నాయి.

 పొత్తులపై సోము వీర్రాజు క్లారిటీ

పొత్తులపై సోము వీర్రాజు క్లారిటీ

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందంటూ దాదాపుగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్న సంకేతాలు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీలో అసహనం పెంచుతున్నాయి. ఈ విషయం ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో బహిర్గతమైంది. వచ్చే ఎన్నికలకు చేసుకునే పొత్తులపై సోము వీర్రాజు ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి సోము స్పష్టత ఇచ్చినట్లయింది.

అవసరమైతేనే జనసేనతో పొత్తు

అవసరమైతేనే జనసేనతో పొత్తు

మా పొత్తు ప్రజలతోనే ఉంటుందని, ఇంకో పార్టీతో పొత్తు అవసరంలేదంటూ సోము వీర్రాజు ఇవాళ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తాజా పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. 2024లో బీజేపీదే అధికారమని ఆయన వెల్లడించారు. టీడీపీతో కలుస్తాడా లేదా అన్నది పవనే చెప్పాలంటూ ఆయన మరో డిమాండ్ కూడా చేశారు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తమ ప్రస్తుత మిత్రుడు పవన్ కళ్యాణ్ నుంచి సోము కోరిన క్లారిటీ రాగానే ఈ పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేస్దుందని అంచనా వేస్తున్నారు.

English summary
ap bjp president somu veerraju on today made it clear that they will go alone and if needed with janasena only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X