బీసీ సీఎం వ్యాఖ్యలపై సోము వీర్రాజు యూటర్న్ .. పవన్ ఒత్తిడినా ? అధిష్టానం ఆదేశాలా ? హాట్ డిస్కషన్
ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన 24 గంటల లోపే యూ టర్న్ తీసుకున్నారు. తాను ఆ మాట అనలేదని, కొందరు తన మాటలను వక్రీకరించి అలా ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. నిన్నటికి నిన్న రాష్ట్రంలోని అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీ కి సవాల్ విసిరిన సోము వీర్రాజు 24 గంటల్లో తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.

సీఎం అభ్యర్థి నిర్ణయం తన పరిధిలోనిది కాదన్న సోము వీర్రాజు
సీఎం అభ్యర్థిని తాము ప్రకటించమని, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్షం జనసేన నిర్ణయం కూడా అందులో ఉంటుందని సోము వీర్రాజు ప్రకటించారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తారని పేర్కొన్నారు. బిసి అయిన నరేంద్ర మోడీని బిజెపి ప్రధానిని చేసిందని చెప్పి, తాను వైసీపీ టీడీపీలను బీసీ ముఖ్యమంత్రి చేయగలరా అని మాత్రమే ప్రశ్నించానని సోము వీర్రాజు పేర్కొన్నారు.

బీసీని సీఎం చేస్తాం .. ఆ దమ్ము టీడీపీకి వైసీపీకి ఉందా అని ప్రశించిన సోము వీర్రాజు
ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల వినతులను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని సోము వీర్రాజు తెలిపారు. నిన్నటికి నిన్న టీడీపీ, వైసీపీ లకు బీసీ ని సీఎం చేసే దమ్ముందా అంటూ విరుచుకుపడిన సోము వీర్రాజు ఆ దమ్ము బిజెపికి ఉందని చెప్పి, ఈరోజు బిసి సీఎం వ్యాఖ్యలపై యు టర్న్ తీసుకున్నారు. బిజెపి సకలజనుల పార్టీ అని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సంచలనం .. పవన్ కు షాక్ అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
నిన్న సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి . రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చినట్లు ప్రధానంగా చర్చ జరిగింది. జనసేన బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ రాజకీయంగా బలపడుతున్నాడని , బీజేపీ జనసేన కూటమి నుండి సీఎం అభ్యర్థి అని జనసైనికులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు దుమారం రేపాయి.

సోము వీర్రాజు యూటర్న్ వెనుక మర్మమేమిటో ?
మరి ఈ రోజు మళ్ళీ మాట మార్చటం వెనుక జనసేన ఒత్తిడి పని చేసిందా? లేదా అధిష్టానం ఆదేశించిందా అన్న చర్చ జరుగుతుంది . ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు మాట మార్చటం బీజేపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే . తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, సీఎం నిర్ణయించేది హైకమాండ్ అని సోము వీర్రాజు చెప్తున్నారు. నిన్న బిసి సి ఎం అని ప్రకటించి, ఈరోజు అబ్బే అదేం లేదంటూ మాట మార్చిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నిన్న చెప్పిందంతా తూచ్ అనేశాడు ఏంటి ? దీని వెనుక మర్మమేమిటి అని అంతా చర్చిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications