అడ్డుకోగలిగాం: సబ్బం హరి, సోనియా గాంధీ అసహనం!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును రానివ్వకుండా తాము అడ్డుకోగలిగామని కాంగ్రెసు పార్టీ అమలాపురం శాసన సభ్యులు సబ్బం హరి బుధవారం అన్నారు. లోకసభ వాయిదా పడిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి డెబ్బై నుండి 80 మంది సభ్యుల మద్దతు లభించిందన్నారు. సభాపతి ముందు అనేక విషయాలను లేవనెత్తామన్నారు. ప్రజలు జరుగుతున్న విషయాలను గమనిస్తున్నారని, ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ప్రజలలోకి వెళ్తామని చెప్పారు. విభజనపై కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఉంచుతామన్నారు.

సోనియా అసహనం!
లోకసభలో లోక్‌పాల్ బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. నిరసన మధ్యనే లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. సభ్యులు జోరుగా నినాదాలు చేస్తుండటంతో ఏఐసిసి అధ్యక్షురాలు అసహనానికి లోనయ్యారు. అక్కడే ఉన్న కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ను... ఇదంతా ఏమిటని ప్రశ్నించారట కూడా.
అంతకుముందు లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వారాజ్ ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, అధికారపక్ష సభ్యుల తీరుతో సభ సజావుగా సాగడం లేదన్నారు. సభలో ప్రశాంత పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications