Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడుకు ఉద్యోగానికి...: బాబు ఇలాకాలో సోనియాపై జగన్

చిత్తూరు: రాష్ట్ర విభజన అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ విడగొడుతున్నారని ఆయన విమర్శించారు. తన కుమారుడిని ప్రధాని ఉద్యోగం సీట్లో కూర్చోబెట్టడానికి సోనియా గాంధీ మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఓట్లు, సీట్ల కోసం సోనియా రాష్ట్రాన్ని విభిజిస్తుంటే చంద్రబాబు నాయుడు సమైక్యాన్ని బంగాళాఖాతంలో కలిపి సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్యాకేజీలో కోసం విభజనకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు. పోరాటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని, విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇప్పటికైనా లేఖ ఇవ్వాలని ఆయన అన్నారు. సమైక్యం కోసం చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు నిలదీయాలని ఆయన కుప్పం ప్రజలను కోరారు.

ఢిల్లీ కోటను బద్దలు కొడుదామని, ఢిల్లీలో కొత్త కోటను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30 పార్లమెంటు సీట్లను గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని ఆయన ప్రజలకు సూచించారు. ఘనకీర్తి కలిగిన చిత్తూరు జిల్లాలో చందమామ మచ్చలా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఉన్నారని, అది మన ఖర్మ అని ఆయన అన్నారు. మొత్తం చిత్తూరు జిల్లా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదిస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నిజాయితీతో కూడిన రాజకీయాలకు దూరంగా ఉన్నారని జగన్ దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని విభజిస్తే ఎదురయ్యే సమస్య గురించి కాంగ్రెసు పెద్దలకు గానీ, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు గానీ తెలుసా అని ఆయన అడిగారు. తెలిసి ఉండి కూడా కళ్లుండి కూడా కబోదుల్లా నాటకాలు ఆడేవారిని ఏమనాలని ఆయన అడిగారు. మిగులు జలాలపై రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే తీసేసే పరిస్థితి వస్తే, విడిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన కృష్ణా నదీ జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ అన్నారు. గాలేరు నగరికి, హంద్రీనీవాకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారని ఆయన అడిగారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం నీరు తప్ప మంచినీరు ఉండదని ఆయన అన్నారు.

హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నారని, అలా వెళ్లిపోతే పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని కిరణ్, చంద్రబాబు, సోనియాలను అడుగుతున్నానని జగన్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కంపెనీలు వరుస కట్టి ఏడాదికి 57 వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ వచ్చాయని, అవి 25 వేలకు తగ్గిపోయాయని ఆయన అన్నారు. హైదరాబాద్ స్థానం నాలుగు నుంచి 12వ స్థానానికి దిగజారిందని ఆయన అన్నారు. విభజిస్తే హైదరాబాదులో తగ్గే ఆస్తుల విలువను సోనియా గాంధీ ఇస్తారా అని ఆయన అడిగారు.

YS Jagan - Odarpu

పెళ్లయిన తర్వాత సోనియా మనలో ఒక్కడిగా భారతీయురాలిగా ఉన్నారన, పార్లమెంటులో బిల్లు పెట్టి ఇతర దేశాలవారు వారివారి దేశాలకు వెళ్లిపోవాలంటే సోనియాకు ఎలా ఉంటుందని ఆయన అన్నారు. అరవై ఏళ్లు కలిసి ఉన్న తమను విడిగొడితే ఎలా ఉంటుందని ఆయన అడిగారు. విశాలాంధ్ర కోసం బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని, ఇరు రాష్ట్రాలు మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. సమైక్య తీర్మానం చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభను ఎందుకు సమావేశపరచడం లేదని ఆయన అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విని మరణించినవారి కుటుంబాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుప్పం పరామర్శంచారు. పైపాళ్యంలో ఆయన వెంకటేష్ కుటుంబాన్ని, ఇతర గ్రామాల్లో మరిన్ని కుటుంబాలను ఆయన పరామర్శించారు. బహిరంగ సభకు ముందు వైయస్ జగన్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహిరంగ సభ తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+