దసరా, దీపావళికి ఏకంగా 170 ప్రత్యేక రైళ్లు..! ఎక్కడెక్కడికంటే ?
వచ్చే నెల నుంచి పండుగల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇవాళ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళితో పాటు ఛాత్ పండుగల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇందులో చర్లపల్లి, తిరుపతి, బెంగళూరు, వేళాంకిని, నర్సాపూర్, హిస్సార్, నాందేడ్, ధర్మవరం, బీదర్, జల్నా, ఛాప్రా, యశ్వంత్ పూర్, ధన్ బాద్ వంటి స్టేషన్లు ఉన్నాయి.
చర్లపల్లి నుంచి-రక్సౌల్ కు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకూ ప్రతీ సోమవారం చొప్పున 8 సర్వీసులు, రక్సౌల్ నుంచి-చర్లపల్లికి అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ ప్రతీ గురువారం చొప్పున మరో 8 సర్వీసులు నడుపుతున్నారు. తిరుపతి నుంచి-చర్లపల్లికి సెప్టెంబర్ 7 నుంచి 29 వరకూ ప్రతీ ఆదివారం చొప్పన 4 సర్వీసులు, చర్లపల్లి నుంచి తిరుపతికి సెప్టెంబర్ 8 నుంచి 29 వరకూ ప్రతీ సోమవారం చొప్పున నాలుగు సర్వీసులు నడుస్తాయి.

అలాగే చర్లపల్లి నుంచి తిరుపతికి సెప్టెంబర్ 5 నుంచి 29 వరకూ ప్రతీ శుక్రవారం చొప్పున మరో 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. దీంతో పాటు తిరుపతి నుంచి చర్లపల్లికి సెప్టెంబర్ 6 నుంచి 27 వరకూ ప్రతీ శనివారం చొప్పున మరో 4 సర్వీసులు నడుపుతారు. చర్లపల్లి నుంచి వేళాంకణికి సెప్టెంబర్ 4న గురువారం ఒక ప్రత్యేక రైలు, అలాగే వేళాంకణి నుంచి చర్లపల్లికి సెప్టెంబర్ 5న శుక్రవారం మరో రైలు నడుపుతారు.
south central railway has announced 170 special trains troday to meet passenger rush on diwali, dussehra and chhat festivals.. pic.twitter.com/52oOJhGZi6
— syed ahmed@oneindiatelugu (@syed_ahmed102) August 22, 2025
నర్సాపూర్ నుంచి బెంగళూరుకు అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 12 వరకూ ప్రతీ శుక్రవారం చొప్పున మొత్తం 13 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. బెంగళూరు నుంచి నర్సాపూర్ కు అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27 వరకూ ప్రతీ శనివారం చొప్పున మరో 13 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుపతి నుంచి హిస్సార్ కు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 వరకూ ప్రతీ బుధవారం చొప్పున మొత్తం 9 రైళ్లు, హిస్సార్ నుంచి తిరుపతికి అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకూ ప్రతీ ఆదివారం చొప్పున 9 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
అలాగే నాందేడ్ నుంచి ధర్మవరానికి సెప్టెంబర్ 5 నుంచి 26 వరకూ ప్రతీ శుక్రవారం చొప్పున మొత్తం 4 ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. ధర్మవరం నుంచి నాందేడ్ కు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకూ ప్రతీ ఆదివారం చొప్పున 4 రైళ్లు నడుస్తాయి. బెంగళూరు నుంచి బీదర్ కు ఆగస్టు 26న మంగళవారం ఓ ప్రత్యేక రైలు, బీదర్ నుంచి బెంగళూరుకు ఆగస్టు 27న బుధవారం మరో ప్రత్యేక రైలు ప్రకటించారు.

వీటితో పాటు బెంగళూరు నుంచి బీదర్ కు సెప్టెంబర్ 5 నుంచి 28 వరకూ ప్రతీ శుక్ర, ఆదివారాల్లో 8 రైళ్లు నడుస్తాయి. అలాగే బీదర్ నుంచి బెంగళూరుకు సెప్టెంబర్ 6 నుంచి 29 మధ్య శని, సోమ వారాల్లో 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగా జల్నా నుంచి ఛాప్రాకు ఆగస్టు 27 నుంచి నవంబర్ 26 వరకూ ప్రతీ బుధవారం చొప్పున 14 ప్రత్యేక రైళ్లు, ఛాప్రా నుంచి జల్నాకు ఆగస్టు 29 నుంచి నవంబర్ 28 వరకూ ప్రతీ శుక్రవారం చొప్పున 14 ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. యశ్వంత్ పూర్ నుంచి ధన్ బాద్ కు ఆగస్టు 23 నుంచి డిసెంబర్ 27 వరకూ ప్రతీ శనివారం చొప్పున 19 ప్రత్యేక రైళ్లు, ధన్ బాద్ నుంచి యశ్వంత్ పూర్ కు ఆగస్టు 25 నుంచి డిసెంబర్ 29 వరకూ ప్రతీ సోమవారం చొప్పున మరో 19 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications