ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. హాల్ట్ స్టేషన్లు: అరుణాచలం వెళ్లొచ్చు
Special Trains: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత వేళాంకణి మేరీ మాత ఉత్సవాలు త్వరలో ఆరంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగుతాయి. ఆరోగ్యమాతను దర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేళాంకణికి వెళ్తుంటారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే, సదరన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో సదరన్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను వేళాంకణికి నడిపించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీ మీదుగా వేళాంకణికి రాకపోకలు సాగించనున్నాయి. దీనికి అవసరమైన అడ్వాన్స్ బుకింగ్.. సోమవారం ఉదయం 8 గంటలకు ఆరంభం కానుంది.
ఈ నెల 27, సెప్టెంబర్ 6వ తేదీ (బుధ, శనివారాలు) రాత్రి 8:40 నిమిషాలకు బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరే నంబర్ 09093 ప్రత్యేక రైలు రెండు రోజు ఉదయం 7:40 నిమిషాలకు వేలాంకణ్నికి చేరుకుంటుంది.
ఈ నెల 30, సెప్టెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి 12:30 నిమిషాలకు వేళాంకణ్ని నుంచి బయలుదేరే నంబర్ 09094 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 10:30 గంటలకు బాంద్రా టెర్మినస్ చేరుకుంటుంది.
బోరీవలి, వాసై రోడ్, పన్వేల్, లోనావాలా, పుణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుథురై, నాగపట్నం మీదుగా వేళాంకణికి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications