సర్వాంగ సుందరంగా తిరుమల మాడవీధులు (పిక్చర్స్)

విజయవాడ: తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు అంతా రంగం సిద్దమైంది. బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ చేయనున్నారు. శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారికి నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర భాగంగా వివిధ ఉత్సవాలు జరుగుతుంటాయి.

వీటిలో బ్రహ్మోత్సవాలు ప్రధానమైనవి. కన్యామాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడ్ని నాలుగు మాడవీధులు ఊరేగిస్తారు. పడమర వీధిలోని వసంత మండపంలో సేకరించిన పుట్టమన్నును నవపాలికలలో ఉంచి యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 30న గరుడ సేవ నిర్వహించే రోజున తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించేది లేదని భక్తలు బస్సుల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి గరుడ సేవకు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచానా వేస్తున్నామన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


ఇంత మంది భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహానాలను 24 గంటల పాటు నిషేధిస్తున్నామన్నారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 30 ఉదయం 5.30నుంచి అక్టోబర్ 1వ తేదీ మద్యాహ్నాం 1 గంట వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించమన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


గరుడ సేవ రోజు అలిపిరి వద్ద భక్తులకు అన్నదానంతో పాటు, మంచినీటి సౌకర్యం, వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


భక్తులు అలిపిరిలో ద్విచక్రవాహానాలు ఉంచి అక్కడ నుంచి బస్సుల్లో తిరుమలకు చేరుకోవచ్చని సూచించారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


భక్తులు టాక్సీ ట్రైవర్ల చేతుల్లో మోసపోకుండా టాక్సీల్లో ఒక్కోక్కరికీ రూ. 60 ఛార్జీ నిర్ణయించినట్లు తెలిపారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుమలలో శుక్రవారం నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు 2444 మంది పోలీసులు అధికారులతో పటిష్ట భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


బ్రహ్మోత్సవాలకు మగ్గురు ఎఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, 42 మంది సీఐలు, 132 మంది ఎస్స్లైలు, 11 మంది మహిళా ఎస్సెలు, 360 మంది ఎఎస్సైలు, 1297 మంది కానిస్టేబుళ్లు, 153 మంది మహిలా కానిస్టేబుళ్లు, 429 మంది హొంగార్డులను నియమించినట్లు తెలిపారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల భద్రతను పర్యవేక్షించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటే కంట్రోల్ రూమ్‌ను రాంబగీచ వద్ద ఏర్పాటు చేసామన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


బందో బస్తును 18 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఓ డీఎస్పీ స్దాయి అధికారిని ఇన్ ఛార్జిగా నియమించినట్లు తెలిపారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుమల మాడ వీధుల్లో బారికేడ్స్ ద్వారా ప్రవేశించే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుపతి, తిరుమలలో కలిసి 43 పికెట్లు 24 గంటలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని, ఆరు మొబైల్ వాహనాలతో 24 గంటలు పెట్రోలింగ్‌ను నిర్వహిస్తామన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


నగరంలో ఆటోల ఛార్జీలకు సంబంధించిన ధరలు ముద్రించిన బోర్డులను నగరంలో ఏర్పాటు చేశామన్నారు.

 రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


వాటిని ఎవరైనా అతిక్రమిస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్ ప్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని అన్నారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది భక్తులతో మర్యాదగా నడుచుకుంటూ భక్తి భావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుమల తిరుపతి అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

తిరునగరిలో బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. ఆ పరంధాముని ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు తరలివచ్చే అఖండ భక్త జనకోటికి తమ వంతు సేవలు అందించేందుకు గాను ప్రభుత్వ శాఖలు సిద్దమయ్యాయి. భద్రతా చర్యలలో భాగంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను రప్పించారు. ప్రధాన కూడళ్లు, భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్టోపస్‌ దళాలనూ అదనపు భద్రత కోసం వినియోగించుకుంటున్నారు.

ఈ ఉత్సవాల నుంచి టీటీడీ 60 అధునాతన సీసీ కెమెరాలను నాలుగు మాడవీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్సుల సముదాయాలలో శాశ్వతంగా అమర్చింది. భక్తుల కోసం ముఖ్య మైన ప్రాంతాల్లో అదనపు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం తిరుపతి, సెంట్రల్‌, రుయా ఆస్పత్రుల నుంచి వైద్య సిబ్బందిని డిప్యుటేషన్‌పై రప్పించారు.

ఆలయ నాలుగు మాడవీధుల్లో అదనపు నీటి కొళాయిలు, మరుగుదొడ్లు, చెత్తకుండీలు సిద్ధం చేశారు. తోపులాటలకు తావులేకుండా గ్యాలరీలు, బ్యారికేడ్లను పటిష్టంగా అమర్చారు. ఇందుకు సంబంధించి తిరుపతిలో భక్తులు, యాత్రికులకు సేవలు అందించాలని కలెక్టర్ సిద్దార్ద్ జైన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+