ఉద్యోగులు, విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవు...!!
వచ్చే వారం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహాశివరాత్రి సెలవు. కాగా, 27న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగులు.. ఉపాధ్యా యులకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలని ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అదే సమయంలో అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు పైన నిర్ణయం తీసుకోవాలని సీఈవో వివేక్ యాదవ్ ఆదేశించారు. 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు కు నిర్ణయించారు.
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. క్రిష్ణా - గుంటూరు, అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అభ్యర్ధులు హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ఎన్నికల అధికారులు ఏర్పాట్ల కసరత్తు తుది దశకు చేరింది. ఈ సమయంలోనే ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు.. ఓటింగ్ రోజున సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 27న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. ఇక, ఏపీలోని ఉద్యోగులు.. ఉపాధ్యాయులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సూచించారు. ఎన్నిక లు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు, యాజమాన్యాలు వారి దగ్గర పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అవకాశం కల్పిస్తూ ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకో వాలని సూచించారు. ప్రయివేటు ఉద్యోగులకు ఓటింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని సీఈవో నిర్దేశించారు. ఈ నెల 26న శివరాత్రి సందర్భంగా సెలవు. 27న ప్రత్యేకంగా సెలవు ఖరా రు చేయటంతో ఈ జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి.
-
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications