గుండె రగిలెలా: పవన్ కళ్యాణ్ సభ కోసం స్పెషల్ సాంగ్(వీడియో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ఈ సీమాంధ్ర హక్కుల చైతన్య సభ కోసం
ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. సభకు ముందు నుంచి.. సభ రోజున
పాటను విస్థృతంగా వాడుతూ ప్రజలకు అవగాహన, చైతన్యం రగిలించడానికి
దీన్ని రాసినట్లు చెబుతున్నారు.

ఉద్యమాలకు పాటలే వెన్నెముకలన్న ఉద్దేశంతోనే పవన్ ఏరికోరి
ఈ పాటను రాయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రజల గుండె
రగిలెలా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో
విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ పాటను బద్రీనాయుడు రాయగా ఎమ్మెస్ వాసు పాడారు. కాగా, ఈ పాట వినగానే ఉత్తేజం కలిగించేలా ఉంది. నవంబర్ 10న సాయంత్రం 4 గంటల
అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో నిర్వహించనున్న సీమాంధ్ర హక్కుల చైతన్య సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంతపురంలో కరవు సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ మాట్లాడబోతున్నారు. ముందుగా పాటను కూడా రిలీజ్
చేయడంతో పవన్ ప్రసంగం కూడా అదే స్థాయిలో ఉంటుందని, పక్కాగా ప్రసంగాన్ని రూపొందించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications